ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Italy: ఫిఫా ప్రపంచకప్‌కు ఇటలీ ఎందుకు దూరమైందంటే?

ABN, First Publish Date - 2022-11-26T19:17:12+05:30

నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఇటలీ (Italy) ఈసారి ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup)లో కనిపించకపోవడం సగటు

fifa world cup 2022
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖతర్: నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఇటలీ (Italy) ఈసారి ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup)లో కనిపించకపోవడం సగటు ప్రేక్షకుడిని నిరాశ పరిచింది. ప్రపంచకప్‌లో ఇటలీ కనిపించకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌కు అది ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఇప్పుడు చూద్దాం.

ఆశలు ఆవిరి..

* యూఈఎఫ్ఏ ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్‌ గ్రూప్-సిలో స్విట్జర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లిథువేనియాతో కలిసి డ్రా చేసుకుంది.

* నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్ కప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలం కావడంతో కోచ్ రాబర్టో మాన్సినీ, జట్టుపై ఒత్తిడి విపరీతంగా ఉంది.

* గతేడాది జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్‌ నుంచి విరామం తీసుకోవడానికి ముందు నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లుథువేనియాతో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది.

* టోర్నమెంటులో విజయం సాధించాక వరుసగా బల్గేరియా, స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అంతకుముందు స్వదేశంలో లుథువేనియాతో జరిగిన మ్యాచ్‌లో 5-0తో విజయం సాధించింది.

దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అర్హత సాధించినట్టుగా కనిపించింది. అయితే, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా కావడంతో చివరి రౌండ్‌కు ముందు ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలిచాయి.

* యూరో 2020 విజయం తర్వాత నాలుగు నెలలకు నార్తరన్ ఐర్లాండ్‌-ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయింది. అదే సమయంలో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది.

ఇటలీ ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా అడుగంటాయి?

* నిర్ణయాత్మక ప్లే ఆఫ్ టైలో పోర్చుగల్‌తో తలపడాల్సిన ఇటలీ.. స్వదేశంలో నార్త్ మాసడోనియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓటమి పాలు కావడంతో ఫైనల్స్‌ను కోల్పోయింది.

* నార్తరన్ మాసడోనియా ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఆ జట్టును 2-0తో ఓడించిన పోర్చుగల్ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది.

మరి 2018 ప్రపంచకప్‌కు ఎందుకు క్వాలిఫై కాలేదు?

* 2018 ప్రపంచకప్‌ కోసం జరిగిన క్వాలిపికేషన్ రౌండ్ గ్రూప్-జిలో ఇటలీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

* 2017లో స్వదేశంలో స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌ 0-0తో డ్రా కావడంతో 60 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది.

Updated Date - 2022-11-26T19:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising