ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Infinix Hot 20 5G: 5జీ ఫోన్ ఇంత చవకా? కొనకుండా ఉండగలరా?

ABN, First Publish Date - 2022-12-01T20:49:33+05:30

దేశం ఇప్పుడిప్పుడే 4జీ నుంచి 5జీకి మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను నెమ్మదిగా 5జీ ఫోన్లుగా మార్చుకుంటున్నారు.

Infinix
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశం ఇప్పుడిప్పుడే 4జీ నుంచి 5జీకి మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను నెమ్మదిగా 5జీ ఫోన్లుగా మార్చుకుంటున్నారు. అయితే, 5జీ ఫోన్ల ధర కనీసం రూ. 15 వేలు ఉండడంతో కొంత వెనగ్గి తగ్గుతున్నారు. తర్వాత చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని భారత్‌లో అద్భుతమైన ఫీచర్లతో 5జీ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. దాని పేరు ‘ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ (Infinix Hot 20 5G), దాంతోపాటు ‘ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే’ (Hot 20 Play)ను భారత్‌లో విడుదల చేసింది. ఇవి రెండూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు కావడం ఆకర్షించే మరో అంశం.

మీడియాటెక్ ఎస్ఓసీ, అతిపెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్, ర్యామ్‌ను, ఆన్‌బోర్డ్ స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు వంటివి ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 20జీలో 50 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, హాట్ 20 ప్లేలో 13 ఎంపీ డ్యూటల్ రియర్ కెమెరా ఉంది. మొదటి దాంట్లో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉండగా, రెండోదాంట్లో హోల్‌పంచ్ కటౌట్ ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీని ఇండియాలో లాంచ్ చేయడానికి ముందే పలు దేశాల్లో విడుదల చేశారు.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ, హాట్ 20 ప్లే ధర వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ 4జీబీ ర్యామ్+64జీబీ ర్యామ్ స్టోరేజీ ధర రూ.11,999. స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్ కలర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే 4జీబీ ర్యామ్+64జీబీ వేరియంట్ ధర రూ. 8,999 మాత్రమే. ఇందులో లూనా బ్లూ, అరోరా గ్రీన్, రేసింగ్ బ్లాక్ కలర్ వేరియంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ డిసెంబరు 9 నుంచి, ఇన్ఫినిక్స్ హాటల్ 20 ప్లే ఈ నెల 6 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు

6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓస్ 10.6, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, అండర్‌ ది హుడ్, 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీ,ఇన్‌ఫినిక్స్ మెమ్‌ఫ్యూజన్ ఫీచర్‌తో 4జీబీ ర్యామ్. ఈ ఫీచర్ ద్వారా అందుబాటులో ఉన్న మెమెరీని 7జీబీ వరకు పెంచుకోవచ్చు. బయోనిక్ బ్రీతింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల చిప్‌‌సెట్ ఉష్ణోగ్రతను రెండు నిమిషాల్లో 5 డిగ్రీలకు తగ్గిస్తుంది. 50 మెగాపిక్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉన్నాయి. 64 జీబీ అంతర్గత మెమరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే స్పెసిఫికేషన్లు

6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6, మీడియాటెక్ హెలియా జి37 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, ర్యామ్‌ను కూడా 7జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనకవైపు 13 ఎంపీ రియర్ కెమెరా, క్వాడ్ ఫ్లాష్, ముందువైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా, హోల్‌పంచ్ కటౌట్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 3డి సౌండ్ అనుభవాన్ని ఇచ్చే డీటీఎస్ స్పీకర్‌ కూడా అమర్చారు.

Updated Date - 2022-12-01T20:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising