Jio Phone 5G: జియో 5జీ ఫోన్‌కి సంబంధించి కీలక అప్‌డేట్..
ABN, First Publish Date - 2022-12-13T18:52:45+05:30
రిలయన్స్ (Reliance) నుంచి మార్కెట్లోకి రాబోతున్న 5జీ బడ్జెట్ ఫోన్ ‘జియో ఫోన్ 5జీ’కి (Jio Phone 5G) కీలక సమాచారం వెల్లడైంది.
న్యూఢిల్లీ: రిలయన్స్ (Reliance) నుంచి మార్కెట్లోకి రాబోతున్న 5జీ బడ్జెట్ ఫోన్ ‘జియో ఫోన్ 5జీ’కి (Jio Phone 5G) కీలక సమాచారం వెల్లడైంది. ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనుమతి పరిశీలనకు వెళ్లింది. ఈ మేరకు బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వద్ద జియో 5జీ ఫోన్ కనిపించిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా అంతకుముందు గీకుబెంచ్ లిస్టింగ్ వద్ద కనిపించింది. దీనినిబట్టి చూస్తే జియో 5జీ ఫోన్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అనుమతులన్నీ దక్కిన తర్వాత ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలయ్యే సూచనలున్నాయి.
కాగా జియో 5జీ ఫోన్‌ను రిలయన్స్ తన తదుపరి ఏజీఎంలో (annual general meeting) విడుదల చేసే అవకాశాలున్నాయని ‘ఇండియా టుడే’ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫోన్‌ను గూగుల్ సహకారంతో రూపొందిస్తున్నట్టు ఆగస్టులో రిలయన్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలియరాలేదు. గీకుబెంచ్ వెబ్‌సైటుపై ‘జియో LS1654QB5’ పేరిట ఈ ఫోన్ లిస్టయ్యింది. మరోవైపు 4జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 480+ ఎస్‌వోసీ చిప్‌తో ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 6.5 ఇంచ్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ 90హెడ్జ్ స్ర్కీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13-మెగాపిక్సెల్ డ్యుయెల్ రీర్ కెమెరా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇక రేటు విషయానికి వస్తే.. రూ.8000 నుంచి రూ.10,000 మధ్య ఉండొచ్చని, ఆ తర్వాత రేంజ్‌ను బట్టి రూ.15 వేల వరకు ఉండొచ్చనే విశ్లేషణలున్నాయి.
Updated Date - 2022-12-13T18:54:10+05:30 IST