ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Truecaller: ట్రూకాలర్‌ కొత్త ప్లాన్.. ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐదుగురికి ప్రీమియం ఫీచర్లు..

ABN, First Publish Date - 2022-12-15T19:37:48+05:30

ట్రూకాలర్ తాజాగా భారతీయుల కోసం ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ పేరిట మరో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరికీ ట్రూకాలర్ యాప్(Truecaller) గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్‌తో మనకు ఫోన్ చేసింది ఎవరో ఇట్టే తెలుసుకోవచ్చు. ట్రూకాలర్ తాజాగా భారతీయుల కోసం ఫ్యామిలీ ప్లాన్(Truecaller Family plan) పేరిట మరో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో తెచ్చింది. దీన్ని సబ్‌స్క్రైబ్ చేసిన వారు.. యాప్‌లోని ప్రీమియం ఫీచర్లను మరో నలుగురితో పంచుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ స్మాం బ్లాకింగ్, అపరిమిత కాంటాక్ట్ రిక్వస్టులు, ఇంకాగ్నిటో మోడ్, నో యాడ్స్ సౌకర్యం( వాణిజ్య ప్రకటనలు లేకపోవడం), ఘోస్ట్ కాల్స్, వంటి పలు ప్రీమియం ఫీచర్లు ఈ ప్లాన్‌తో పొందవచ్చు. దీన్ని సబ్‌స్క్రీప్షన్ ధర నెలకు రూ. 132. అయితే.. రూ.952 చెల్లిస్తే ఏడాదంతా ఫ్యామిలీ ప్లాన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పేరుకి ఇది ఫ్యామిలీ ప్లాన్ అయినప్పటికీ.. కుటుంబసభ్యులే కాకుండా ఎవరైనా నలుగురు వ్యక్తులను ఈ సబ్‌స్క్రిప్షన్‌లో చేర్చుకోవచ్చని కూడా కంపెనీ స్పష్టం చేసింది.

ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్(Android) ఫోన్లలోనే అందుబాటులో ఉంది. అయితే.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాక ఐఓఎస్(iOS) వినియోగదారులను కూడా ఈ ప్లాన్‌లో సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ట్రూకాలర్.. ప్రీమియం( సబ్‌స్క్రీప్షన్ చార్జీ నెలకు రూ.39), ప్రీమియం కనెక్ట్(నెలకు రూ.75) పేరిట రెండు ప్లాన్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఇక.. ట్రూకాలర్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం ఫ్యామిలీ ప్లాన్‌ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ప్రీమియం ఫీచర్లు అందించే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను వినియోగదారులు కోరుతున్నారని ట్రూకాలర్ ఇండియా విభాగం హెడ్ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మీడియాకు తెలిపారు. తక్కువ ధరలో ట్రూకాలర్ ప్రీమియం ఫీచర్లు అందుబాటులో తెచ్చేలా ఓ ప్లాన్ రూపొందించాలంటూ విజ్ఞప్తులు అందినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T19:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising