RS Praveen Kumar:ఎమ్మెల్యే కోనప్ప అవినీతికి అడ్డూ అదుపు లేదు
ABN, First Publish Date - 2022-11-21T17:16:35+05:30
జిల్లాలో రూ.కోట్ల అవినీతి జరుగుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
కొమురం భీం: జిల్లాలో రూ.కోట్ల అవినీతి జరుగుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేల అక్రమాలకు జిల్లా కలెక్టర్ సహకరిస్తున్నారని, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్(District Collector Rahul Raj) ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు, అధికారులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప(MLA Konappa) అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు.అన్నింటికి బాధ్యుడైన కలెక్టర్‌పై చర్యలు తీసుకునే దాకా పోరాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Updated Date - 2022-11-21T17:16:37+05:30 IST