Bharat Jodo Yatra: రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాం: రాహుల్
ABN , First Publish Date - 2022-11-07T19:22:00+05:30 IST
రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాం.. గిట్టుబాటు ధర ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు.
కామారెడ్డి: రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాం.. గిట్టుబాటు ధర ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘‘భారత్ జోడో యాత్ర’’ (Bharat Jodo Yatra)లో భాగంగా కామారెడ్డి (Kamareddy) జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో ‘‘భారత్ జోడో గర్జన’’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో తాను చాలా మందితో మాట్లాడానని, మన కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియడారు. తెలంగాణలో ఏ ఒక్కరైతు సంతోషంగా లేడని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం దయనీయ పరిస్థితిలో ఉందని, మీ భూములపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం (TRS Govt) పెత్తనం చేస్తోందని దుయ్యబట్టారు. మీ హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని మారుస్తామని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన రాహుల్ పాదయాత్ర మద్నూర్ మండలం మేనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగియనుంది. అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది.
Read more