TRS becomes BRS: బీఆర్ఎస్ నినాదాన్ని ప్రకటించిన కేసీఆర్..
ABN, First Publish Date - 2022-12-09T16:35:57+05:30
బీఆర్ఎస్ (BRS) నినాదం.. అబ్ కి బార్ కిసాన్ కా సర్కార్ అని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ పేరు అధికారికంగా మారింది.
హైదరాబాద్: ‘అబ్ కి బార్.. కిసాన్ కా సర్కార్’... బీఆర్‌ఎస్ నినాదం ఇదేనని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. కిసాన్ నినాదంతో దేశంలో బలపడతామని, త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి ఇప్పటికిప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగరబోయేది గులాబీ జెండానేనని విశ్వాసం వ్యక్తం చేశారు. 14న ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభిస్తామని, అదే రోజు కార్యాలయ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
Updated Date - 2022-12-09T17:09:41+05:30 IST