ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode By Election: మంత్రి జగదీశ్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

ABN, First Publish Date - 2022-10-28T21:37:03+05:30

మంత్రి జగదీశ్రెడ్డి (Jagadish Reddy)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఈసీ (CEC)కి బీజేపీ నేత కపిలవాయి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ (TRS)కి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని, జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారని సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Jagadish Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: మంత్రి జగదీశ్రెడ్డి (Jagadish Reddy)కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై సీఈసీ (CEC)కి బీజేపీ నేత కపిలవాయి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ (TRS)కి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని, జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారని సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక అందించాలని.. రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. గురువారం జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై వాస్తవిక నివేదికను ఎస్ఈసీ అందించింది. నివేదిక ఆధారంగా ఆయనకు సీఈసీ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని జగదీశ్రెడ్డికి ఈసీ ఆదేశించింది. ఎన్నికల నియమావళిని మంత్రి ఉల్లంఘించారని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.

సంక్షేమ పథకాలు కావాలంటే టీఆర్‌ఎస్‌కు, వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని జగదీశ్‌ రెడ్డి మునుగోడు ప్రజలకు సూచించారు. ‘ఈ ఎన్నిక కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మధ్య జరుగుతున్నది కాదు. సంక్షేమ పథకాలు కావాలా.. వద్దా..అన్న ఆంశపై జరుగుతున్న ఎన్నిక’ అని చెప్పారు మంగళవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ‘గుజరాత్‌లో వ్యవసాయబావులకు మోటర్లు బిగించడంతో రైతులకు నెలకు రూ.1,500 బిల్లు వస్తోంది. ఇక్కడ కూడా అలాగే కావాలంటే బీజేపీకి ఓటు వేసుకోవచ్చు’ అని విమర్శించారు.

Updated Date - 2022-10-28T21:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising