ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna Math: కన్నుల పండువగా శారదామాత జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-12-15T18:38:19+05:30

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో దివ్యజనని శ్రీ శారదాదేవి 170వ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

Maa Sarada Birth Anniversary Celebrations
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రామకృష్ణ మఠం(Ramakrishna Math) లో దివ్యజనని శ్రీ శారదాదేవి (Shri Sarada Maa) 170వ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మఠంలో ఉదయం ఐదున్నరకు సుప్రభాతం, మంగళారతి, భజనలు నిర్వహించారు. ఆరున్నర గంటలకు దేవాలయ ప్రదక్షిణం, ఏడు గంటలకు విశేష పూజ, లలితా సహస్రనామ పారాయణం, భజనలు చేశారు. పదిన్నరకు హోమం నిర్వహించారు. పదకొండున్నరకు దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం, సందేశంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) ప్రసంగించారు. 12 గంటలా 15 నిమిషాలకు విశేష హారతి తర్వాత భక్తులకు భోజన ప్రసాదం అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయం దిగువ హాలులో దివ్యజనని శ్రీ శారదాదేవి చలనచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలు నిర్వహించారు.

శారదాదేవి 170వ జయంతి వేడుకల సందర్భంగా స్వామి వివేకానంద (Swami Vivekananda) సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.

Updated Date - 2022-12-15T18:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising