Bontu Rammohan: నేను ఎక్కడికి వెళ్ళలేదు..
ABN, First Publish Date - 2022-12-01T11:05:09+05:30
తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Former mayor Bontu Rammohan) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో పాటు గత మూడు రోజులుగా కనిపించడంలేదంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొమిరెడ్డి శ్రీనివాస్ (Komireddy Srinivas) ఓ పంక్షన్‌లో పరిచయం అయ్యారని, అంతమాత్రాన ఆయనతో తనకు సంబంధాలుంటాయా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరి కుట్ర ఉందో అందరికీ తెలుసని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.
శ్రీనివాస్ కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేంద్రం కక్షపూరితంగానే టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తోం
దని బొంతు రామ్మోహన్ అన్నారు. బెట్టింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరో కూడా తెలియదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, నిజం నిలకడగా తెలుస్తుందన్నారు. ఉప్పల్‌లో కొన్ని ప్రోటోకాల్ సమస్యలు ఉన్నాయని.. వాటిపై త్వరలో మాట్లాడతానని బొంతు రామ్మోహన్ అన్నారు.
Updated Date - 2022-12-01T11:05:13+05:30 IST