ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: హస్తినలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్‌.. రేపు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-13T11:20:13+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (BRS) జాతీయ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): సీఎం కేసీఆర్ (CM KCR) హస్తినలో బిజీ

బిజీగా ఉన్నారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (BRS) జాతీయ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. పూర్ణాహుతి తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, బీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటిస్తారు. దీంతో పాటు జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.

ఏ పెద్ద కార్యం తలపెట్టినా పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసే కేసీఆర్.. జాతీయ కార్యాలయం ప్రారంభిస్తున్న సందర్భంగా రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు నవంబర్ నెలలో ఫామ్ హౌస్‌లో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో 2019 జనవరిలో ఐదు రోజులపాటు సహస్ర చండీయాగం నిర్వహించారు. గతంలోనూ పలు యాగాలు చేసిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి వెళుతున్న కీలక సమయంలో ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, నిరంజ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

వారం రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంస్థలతో సమావేశమై బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్ అక్కడ బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి పార్టీ ఆఫీసులు తెరవనున్నారు. విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి భూముల కోసం ఆ పార్టీ నేతలు గాలిస్తున్నారు. త్వరలో ముంబై, బెంగళూరులో కార్యాలయాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-12-13T11:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising