TS News: సీఎం కేసీఅర్‌తో నిత్యం టచ్‌లో ఎమ్మెల్యే రేగా కాంతారావు
ABN, First Publish Date - 2022-11-27T09:18:40+05:30
పినపాకపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంతో ముఖ్యమంత్రి కేసీఅర్ (CM KCR)తో ఎమ్మెల్యే రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పినపాకపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంతో ముఖ్యమంత్రి కేసీఅర్ (CM KCR)తో ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao) నిత్యం టచ్‌లో ఉంటున్నారు. రేగా ప్రతిపాదనతో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్‌తో ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పినపాక నియోజకవర్గంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్ ఇలా మొత్తం 31 అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. వంద కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. వంద కోట్లు మంజూరుతో రేగా అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్క పినపాక నియోజకవర్గానికే రూ. వంద కోట్లు మంజూరు కావడంతో మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేగా నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తెచ్చారని, మిగతా ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి చెందినవారేకాదా.. మీరెందుకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధులు తీసుకురారంటూ ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
Updated Date - 2022-11-27T09:18:43+05:30 IST