MLAs poaching Case: ముగ్గురు నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

ABN , First Publish Date - 2022-11-07T17:09:08+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిమాండ్ విధించడాన్ని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్ శర్మ, నందకుమార్‌, సింహయాజిలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

MLAs poaching Case: ముగ్గురు నిందితుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
Supreme Court

ఢిల్లీ: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో ముగ్గురు ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్ శర్మ, నందకుమార్‌, సింహయాజిలు హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ పరిశీలించింది. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ కేసులు కిందికోర్టులో ఉన్నాయంటూ ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి అలియాస్‌ సతీష్‌శర్మ, నందకుమార్‌, సింహయాజిలపై (120-బి,171-బి ఆర్‌/డబ్ల్యు 34 ఐపీసీ అండ్‌ సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రెవెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ ఆక్ట్‌ 1988 సెక్షన్‌ కింద) మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే పోలీసుల రిమాండ్‌ రిపోర్టును ఈనెల 27న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ల ప్రకారం అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత నిందితులకు రిమాండ్‌ విధించాలని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Updated Date - 2022-11-07T18:07:23+05:30 IST

Read more