ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Minister KTR : మోదీ, షాకు చెంపపెట్టు

ABN, First Publish Date - 2022-11-07T03:32:27+05:30

మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలాడినా ఓటర్లు తిప్పికొట్టారని, ఈ తీర్పు మోదీ, అమిత్‌షాలకు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు.

Minister KTR
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బీజేపీ డ్రామాలను తిప్పికొట్టిన మునుగోడు

అభివృద్ధి, ఆత్మగౌరవానికి ఓటర్ల పట్టం

గెలుపు కోసం వందల కోట్లు గుప్పించారు

బీజేపీ అభ్యర్థి వల్లే ఖరీదైన ఎన్నిక అయింది

పలు చోట్ల వారి డబ్బు పట్టుబడింది: కేటీఆర్‌

మునుగోడును దత్తత తీసుకుంటానని ట్వీట్‌

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలాడినా ఓటర్లు తిప్పికొట్టారని, ఈ తీర్పు మోదీ, అమిత్‌షాలకు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఉప ఎన్నిక ఢిల్లీ నాయకత్వానికి, గల్లీ నాయకత్వానికి మధ్య జరిగిన పోటీ అని తెలిపారు. గెలుపోటములను హుందాగా స్వీకరించాలి తప్ప.. చిల్ల ర రాజకీయాలు చేయవద్దన్నారు. ‘‘ఉద్యోగ సంఘాలను తిట్టారు. ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మేము కూడా తూర్పార పట్టొచ్చు. కానీ, ఎన్నికల కమిషన్‌ కేంద్రం అధీనంలో ఉంటుందన్న విషయం బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలియదు. ఎన్నికల కమిషన్‌ను తిడితే ప్రధాని మోదీని తిట్టినట్లే’’ అని కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఓటర్ల చేతులపై కమలం గుర్తులు వేయడం, తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడులు చేయించి తిరిగి వారిపైనే దాడులు చేశారంటూ ప్రచారం చేసుకోవడం చిల్లర రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. ‘‘గెలవాలన్న లక్ష్యంతో వంద ల కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఫేక్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థులను పెట్టారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి.. కారును పోలిన గుర్తులను కేటాయించారు. ఫేక్‌ సర్వేలు నిర్వహించి గెలుస్తున్నామన్నట్లుగా వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎ్‌సలో కలిశారని కథనాలు సృష్టించారు. ఐటీ దాడులు చేయించి.. డబ్బులు దొరికాయని ప్రచారం చేశారు. రూ.3 వేల పింఛన్‌ ఇస్తామని చెప్పారు. ఇవన్ని ఫేక్‌.. ఫేక్‌’’ అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

ఉప ఎన్నిక తెచ్చిందెవరు?

బీజేపీ వ్యవహారం దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందని కేటీఆర్‌ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైన ఎన్నికగా మారిందని పదే పదే అంటున్నారని, కానీ.. ఈ ఎన్నికను తెచ్చిందెవరని ప్రశ్నించారు. హుజూరాబాద్‌, మునుగోడులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులిద్దరూ ధనవంతులు కావడం వల్లే ఆయా ఉప ఎన్నికలు కాస్ట్‌లీ అయ్యాయన్నారు. 2018 నుంచి రాష్ట్రంలోని ఇతర చోట్లలోనూ ఉప ఎన్నికలు జరిగాయని, కానీ.. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు సాధారణ వ్యక్తులైనందున డబ్బు ప్రభావం లేదని చె ప్పారు. ‘‘బండి సంజయ్‌ అనుచరుడు వేణు కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డాడు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల పీఏ రూ.90 లక్షలు తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. వివేక్‌ గుజరాత్‌ నుంచి హవాలా మార్గంలో 2.5 కోట్లు తరలిస్తుండగా.. పట్టుకున్నారు. మరో రూ.75 కోట్లు పార్టీ మారిన వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేశారు. జమున హేచరీస్‌ ఖాతాలోకి రూ.25 కోట్లు, రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో నుంచి ఓటర్ల ఖాతాలోకి 5.25 కోట్లు మళ్లించలేదా?’’ అని కేటీఆర్‌ నిలదీశారు. వీటన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు ఉంచుతున్నానంటూ వాటిని ప్రదర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్న బీజేపీ..

బీజేపీకి నాయకత్వం వహిస్తున్న అమిత్‌షా, నరేంద్రమోదీ దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తే మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఇంకా మెజారిటీ రావాల్సి ఉందని, అయితే మెజారిటీ తగ్గినా గెలుపును ఆపలేరని పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సను గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు, పార్టీ శ్రేణులకు, సోషల్‌ మీడియా వారియర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బీజేపీ గెలుపు కోసం కేంద్రం 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను, 40 ఐటీ బృందాలను దించిందని, తిమ్మిని బమ్మిని చేసైనా గెలవాలనుకుందని కేటీఆర్‌ ఆరోపించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ అభ్యర్థి గెలిచారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి గత ఎన్నికల్లో 76,687 ఓట్లు రాగా, ఈసారి 97 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. ఇక 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డికి 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 10 వేల ఓట్లు తగ్గాయని అన్నారు. ఈ లెక్కన రాజగోపాల్‌రెడ్డికి 30 వేల ఓట్లు తగ్గాయని చెప్పారు. మీడియా సమావేశంలో కేటీఆర్‌తోపాటు మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఫలితాల అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయనను కేటీఆర్‌ అభినందించారు.

మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

‘‘టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకం ఉంచి పార్టీని గెలిపించినందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. నేను ముందుగా చెప్పినట్లు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను. అక్కడ పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాను. ఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రలో తొలిసారిగా ఒకేపార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు. జిల్లాలో జరిగిన గత మూడు ఉప ఎన్ని కలో ప్రజలు మాకు మద్దతు పలకడం సంతోషంగా ఉంది’’ - ట్విటర్‌లో కేటీఆర్‌

Updated Date - 2022-11-07T03:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!