ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ముదిరాజ్‌లను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-11-08T00:34:49+05:30

రాంనగర్‌, నవంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి) : తమ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు కేటాయించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రాంనగర్‌, నవంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి) : తమ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు కేటాయించాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 21న ప్రపంచ మత్య్సకార్మికుల దినోత్సవం, మహాసభ వేడుకలను పురస్కరించుకొని పల్లెపల్లెకు ముదిరాజ్‌ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ముదిరాజ్‌ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌ కులస్థుల సమస్యల పరిష్కారం కోసం మహాసభ కృషి చేస్తోందన్నారు. ముదిరాజ్‌లను బీసీ డి గ్రూప్‌ నుంచి ఏ గ్రూప్‌లోకి మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని బీసీ కమిషన్‌ను కోరారు . అన్ని జిల్లాల్లో ఫిషరీష్‌ సొసైటీలకు, ఫెడరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి రూ.3 వేలకోట్ల బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సమావేశఽంలో మహాసభగౌరవ అధ్యక్షుడు రొక్కంభూపతి, సలహదారుడు పిట్టల రవీందర్‌, ప్రొఫెసర్‌ నీలా రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు మాణిక్యం, యువజన విభాగం నాయకులు శ్రీనివాస్‌, జగన్‌, బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!