ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Raja Singh: మెదటసారి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ సతీమణి

ABN, First Publish Date - 2022-11-07T17:19:33+05:30

బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)తో ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)తో ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి సమావేశమయ్యారు. ఉషాబాయి మెదటసారి బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రాజాసింగ్‌ను బయటకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ఆమె కోరారు. పార్టీ తరపున రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్, ఇతర కేసులకు సంబంధించి రామచందర్‌రావు, కరుణసాగర్‌ (Ramachander Rao, Karunasagar) న్యాయసాయం చేస్తున్నారు. ఇటీవల రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ హైకమాండ్‌కు బండి సంజయ్‌ లేఖ రాశారు. రాజాసింగ్‌ (Raja Singh)పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక బండి సంజయ్ (Bandi Sanjay) కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను బండి సంజయ్ కోరారు. రాజాసింగ్‌కు సంబంధించిన కేసుల విషయంతో పాటు పార్టీకి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్‌తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మునుగోడు పోలింగ్‌కు ముందే సస్పెన్షన్ ఎత్తివేయాలని భావించారు. కానీ కుదరలేదు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వెంటనే ఉషాబాయి, బండి సంజయ్‌తో భేటీ కావడ గమనార్హం. రాజాసింగ్‌ ఇచ్చిన వివరణపై బీజేపీ (BJP) హైకమాండ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌కు అన్ని విధాలుగా మద్దతివ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Updated Date - 2022-11-07T20:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!