ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna Math: ఈ నెల 20న అంతర్‌ యోగం

ABN, First Publish Date - 2022-11-15T21:55:56+05:30

హైదరాబాద్: రామకృష్ణ మఠం (Ramakrishna Math)లో ఈ నెల 20న అంతర్‌ యోగం(Antar Yogam) జరగనుంది.

Hyderabad Ramakrishna Math

హైదరాబాద్: రామకృష్ణ మఠం (Ramakrishna Math)లో ఈ నెల 20న అంతర్‌ యోగం(Antar Yogam) జరగనుంది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ రామకృష్ణ మఠం దేవాలయం దిగువ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. వేద పఠనం, భగవద్గీత, విష్ణు సహస్ర నామ పారాయణం, జపం, భజనలు, శ్రీరామకృష్ణ కథామృత పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) తెలిపారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు భోజన ప్రసాదం ఉంటుంది. ప్రవేశ కూపన్లు మఠం కార్యాలయంలో పొందాలని నిర్వాహకులు సూచించారు. ఈ సారి జరగబోయే అంతర్ యోగం కార్యక్రమానికి దక్షిణాఫ్రికా డర్బన్ రామకృష్ణ వేదాంత సెంటర్‌ (Ramakrishna Vedanta Centre, Durban, South Africa) అధ్యక్షుడు స్వామి స్వాత్మారామానంద (Swami Swatmaramananda) హాజరౌతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆధ్యాత్మిక రిట్రీట్‌లో పాల్గొని ప్రయోజనం పొందాలని స్వామి బోధమయానంద సూచించారు.

రామకృష్ణ మఠంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2022-11-15T22:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising