Delhi: సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర
ABN, First Publish Date - 2022-12-01T12:18:39+05:30
సీబీఐ (CBI) విచారణకు ఢిల్లీలోని తెలంగాణ భవనం నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
ఢిల్లీ: సీబీఐ (CBI) విచారణకు ఢిల్లీలోని తెలంగాణ భవనం నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఎంపీ వద్దిరాజు రవి చంద్ర (Vaddiraju Ravi Chandra) కూడా మంత్రితోపాటు ఉన్నారు. ఇద్దరికీ నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో గురువారం ఉయదం ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు నేతలు తెలంగాణ భవన్‌లో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.
నకిలీ సీబీఐ అధికారి కొమిరెడ్డి శ్రీనివాస్ (Komireddy Srinivas) కేసులో ఈ విచారణ జరుగుతోంది. శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ సందర్బంగా గంగుల, రవిచంద్రల వాగ్మూలం రికార్డు చేయనున్నారు. శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రలోభ పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. అలాగే గ్రానైట్ ఎగుమతి కేసులో ఇద్దరి మధ్య సంబంధాలపై సీబీఐ ఆరాతీయనుంది.
Updated Date - 2022-12-01T12:18:45+05:30 IST