Ajmer Dargah: లౌకికత్వానికి తెలంగాణ ప్రతీక- కవిత
ABN, First Publish Date - 2022-10-28T19:13:25+05:30
జైపూర్: రాజస్థాన్ లోని అజ్మీర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు.
జైపూర్: రాజస్థాన్ లోని అజ్మీర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు. అనంతరం దర్గా పెద్దలను కవిత కలుసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. రాజస్థాన్‌లోని పుష్కర్ దేవాలయాన్ని మరియు శ్రీనాథ్ జీ దేవాలయాన్ని కూడా కవిత దర్శించుకున్నారు.
కవితతో పాటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజం అలి, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ , టీఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్, అలిం తదితరులు అజ్మీర్ దర్గాను దర్శించుకున్నారు.
Updated Date - 2022-10-28T19:16:38+05:30 IST