Kalvakuntla Shobha Rani: మర్పడగ క్షేత్రంలో కేసీఆర్ సతీమణి ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2022-10-31T18:55:12+05:30
సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి (Kalvakuntla Shobha Rani) సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండపాక: సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి (Kalvakuntla Shobha Rani) సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారంతో పాటు విజయ దుర్గామాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభారాణి కేసీఆర్ సోదరి వినోదతో కలిసి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో హరినాథశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు సుమారు 3 గంటల పాటు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయదుర్గామాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయంలో ఉన్న మహిళలకు శోభారాణి పసుపు బొట్టు అందజేశారు.
అనంతరం గోపూజ చేసి గోవుకు ఆహారం అందించారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు హరినాథశర్మ దంపతులు శోభారాణికి అమ్మవారి శేష వస్త్రాలను అందజేశారు. సీఎం సతీమణి రాక సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నాయకులు ఏమల్ల రాజిరెడ్డి, ఆలయ కమిటీసభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ క్షేత్రంలో 2006లో కేసీఆర్ సహస్ర చండీయాగం నిర్వహించారు. అదే సమయంలో విజయదుర్గ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2009 అక్టోబరులో విజయదుర్గామాత ఆలయ ప్రతిష్ఠ జరిగింది.
Updated Date - 2022-10-31T18:55:49+05:30 IST