దేశ సమగ్రతకు పాటుపడాలి
ABN, First Publish Date - 2022-10-31T23:14:42+05:30
దేశ సమగ్రత, ఐక్యతలను పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు పాటు పడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
- సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళి అర్పించిన అధికారులు, నాయకులు
గద్వాల క్రైం, అక్టోబరు 31 : దేశ సమగ్రత, ఐక్యతలను పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు పాటు పడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాలులో సర్దార్ వల్లబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత దేశ మొట్ట మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేసిన వల్లబాయ్ పటేల్ ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. వారి సేవలు చిరస్మనీయమన్నారు. ప్రతీ ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పటేల్ సేవలు మరువలేనివి : ఎస్పీ
దేశరక్షణ, సమగ్రతకు భారత దేశ ప్రథమ హోంశాఖ మంత్రి, ఉపప్రధాని, ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములునాయక్, ఏవో సతీష్, సీసీ లోహిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యతకు ప్రతిరూపం సర్దార్ పటేల్
గద్వాల టౌన్ : భారతదేశాన్ని సమైకంగా ఉంచడంలో భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్ల భాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీమని ఎంఏఎల్‌డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. శ్రీపతి నాయుడు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని కళాశాలలు, పాఠశాలల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. కళాశాల వద్ద విద్యార్థులతో సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సత్యన్న, హరి బాబు, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
నవ భారత నిర్మాణానికి కృషి చేయాలి
మల్దకల్ : నవ భారత నిర్మాణానికి యువత కృషి చేయాలని ప్రిన్సిపాల్ రమేష్‌లింగం విద్యార్థులకు సూచిం చారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనం తరం బస్టాండు కూడలిలో మానవ హారం ఏర్పాటుచేసి సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్ ఎస్ యూనిట్ అధికారులు రామాంజనేయులుగౌడ్, నరసింహులు, అధ్యాపకులు శివకుమార్, గోవర్దన్‌శెట్టి, భాగ్యలక్ష్మీ, శ్రీనివాసులు, తిమోతి, శ్రీనాథ్, రమేష్, జయరాం, ఆంజనేయులు ఉన్నారు.
మహనీయుల ఆశయాలు కొనసాగిద్దాం
అయిజ : మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ అలంపూర్ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిర్మల్‌రెడ్డి అన్నారు. సర్దార్ వల్లబాయ్‌పటేల్ జయంతిని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భీమ్‌సేన్‌రావు, నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్, ఉపాధ్యక్షులు లక్ష్మణగౌడు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు అంజి, ప్రధాన కార్యదర్శి పరశురామ్, రఘు, భీమన్న పాల్గొన్నారు.
Updated Date - 2022-10-31T23:18:56+05:30 IST