ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి మెడికల్‌ కాలేజీలో 150 సీట్లు భర్తీ

ABN, First Publish Date - 2022-12-15T00:18:55+05:30

సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ అయ్యాయి. వివిధ విడతల్లో జరిగిన కౌన్సెలింగ్‌ ద్వారా ఆ మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. ఆల్‌ ఇండియా కోటా కింద 22 మంది, స్టేట్‌ కోటా కింద 128 మంది వైద్య విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వం మంజూరు చేసిన 150 ఎంబీబీఎస్‌ సీట్లకు 150 సీట్లు భర్తీ కావడం విశేషం. అందులో 61 మంది బాలురు, 89 మంది బాలికలు అడ్మిషన్‌ పొందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

60 శాతం మంది బాలికలే అడ్మిషన్‌

పూర్తి సీట్ల భర్తీపై జిల్లా యంత్రాంగం హర్షం

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 14: సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ అయ్యాయి. వివిధ విడతల్లో జరిగిన కౌన్సెలింగ్‌ ద్వారా ఆ మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. ఆల్‌ ఇండియా కోటా కింద 22 మంది, స్టేట్‌ కోటా కింద 128 మంది వైద్య విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వం మంజూరు చేసిన 150 ఎంబీబీఎస్‌ సీట్లకు 150 సీట్లు భర్తీ కావడం విశేషం. అందులో 61 మంది బాలురు, 89 మంది బాలికలు అడ్మిషన్‌ పొందారు. దాదాపు 60 శాతం విద్యార్థినులు అడ్మిషన్‌ పొందారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్టళ్లల్లో 128 మంది వసతి పొందుతున్నారు. సంగారెడ్డిలో పూర్తి సీట్లు భర్తీ కావడంపై జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది.

బాధ్యత మరింత పెరిగింది

- డాక్టర్‌ వాణి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, సంగారెడ్డి

సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి మంజూరైన 150 సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అందుకు అనుణంగా వైద్య విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మెడికోల నుంచి ఫిర్యాదులు రాకుండా సకల సౌకర్యాలు సమకూర్చుతాం. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. ఇందుకు నిదర్శనమే 150 సీట్లు భర్తీ కావడం. ఇందుకు సహకరించి, నిత్యం మార్గనిర్ధేశనం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషాకి ప్రత్యేక ధన్యవాదాలు.

Updated Date - 2022-12-15T00:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising