ఐబీ గిరిజన తండాలో సమయానికి రాని టీచర్‌

ABN , First Publish Date - 2022-11-07T23:24:27+05:30 IST

మండలంలోని ఐబీ గిరిజన తండాలోని ప్రాథమిక పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నాడని సర్పంచ్‌ రంజిత్‌నాయక్‌ ఆరోపించారు.

ఐబీ గిరిజన తండాలో సమయానికి రాని టీచర్‌

అల్లాదుర్గం, నవంబరు 7: మండలంలోని ఐబీ గిరిజన తండాలోని ప్రాథమిక పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నాడని సర్పంచ్‌ రంజిత్‌నాయక్‌ ఆరోపించారు. ఉదయం 9.15 గంటలకు పాఠశాలను తెరవాల్సి ఉండగా, సమయ పాలన పాటించకుండా ప్రతీరోజు ఉదయం 10 గంటల తర్వాత పాఠశాలను తెరుస్తున్నారని సర్పంచు రంజిత్‌ తెలిపారు. దీంతో విసుగు చెంది సోమవారం ఆ పాఠశాలను సందర్శించగా ఉపాధ్యాయుడు ఉదయం 10 గంటల తర్వాత హాజరయ్యారన్నారు. ఇలా ప్రతీ రోజు పాఠశాల ఉపాధ్యాయుడు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్రం గా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించగా... పాఠశాల ఉపాధ్యాయురాలు సెలవుల్లో ఉండడంతో ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను పంపిస్తున్నామని వివరిస్తున్నారన్నారు.

Updated Date - 2022-11-07T23:24:27+05:30 IST

Read more