ఎప్పటికప్పుడు ధరణి సమస్యల పరిష్కారం
ABN, First Publish Date - 2022-11-04T23:43:28+05:30
సంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ మండల తహసీల్దార్లను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్
సంగారెడ్డిటౌన్, నవంబరు 4: సంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ మండల తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ తదితర అంశాలపై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు మండలాల్లో ధరణి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో తహసీల్దార్లు సీరియ్‌సగా పనిచేయాలన్నారు. సరైన కారణాలు లేకుండా తిరస్కరించరాదన్నారు. దరఖాస్తులు తిరస్కరిస్తే దానికి సంబంధించిన సరైన కారణం చూపాలని ఆయన సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని తెలిపారు. ఆయా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టితో పూర్తి బాధ్యతగా ఈ నెలాఖరులోగా తమ మండలంలో గల ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆయా విషయాల్లో రెవెన్యూ యాక్ట్ మేరకు పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, రెవెన్యూ డివిజనల్ అఽధికారులు నగేశ్, రమేశ్‌బాబు, అన్ని మండలాల తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-04T23:43:29+05:30 IST