ఉత్కంఠ పోరులో గులాబీదే విజయం

ABN , First Publish Date - 2022-11-07T01:14:54+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో గులాబీ శ్రేణు ల్లో జోష్‌ కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. 2023లో జరిగే సాధారణ ఎన్నికల కు ముందు ఈ ఎన్నికను సెమీఫైనల్‌గా భావించిన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్వశక్తులు ఒడ్డా యి.

ఉత్కంఠ పోరులో గులాబీదే విజయం
విజయ సంకేతం చూపుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సమరోత్సాహం

కలిసొచ్చిన కామ్రేడ్ల పొత్తు

12కు 12 స్థానాల్లో గులాబీ పాగా

ఫలించించిన మంత్రి జగదీష్‌రెడ్డి మంత్రాంగం

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతిని ధి): మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో గులాబీ శ్రేణు ల్లో జోష్‌ కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. 2023లో జరిగే సాధారణ ఎన్నికల కు ముందు ఈ ఎన్నికను సెమీఫైనల్‌గా భావించిన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్వశక్తులు ఒడ్డా యి. జాతీయ పార్టీగా అవతరించనున్న బీఆర్‌ఎ్‌సకు పునాదిరాయి కావాలన్న అధినేత ఆశను నెరవేర్చామన్న ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారం, మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అటు కమ్యూనిస్టు మిత్రులతో, ఇటు పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ చక్రం తిప్పడంతో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజ యం సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీపీఎం, సీపీ ఐతో పొత్తుపెట్టుకోవడం టీఆర్‌ఎ్‌సకు లాభించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు మునుగోడు నియోజకవర్గంలో సుమారు 15వేల ఓట్ల వరకు ఉన్నాయి. కాం గ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచారం సాగించినా సీఎం కేసీఆర్‌ రెండుసార్లు బహిరంగ సభలో ప్రసంగించడం, మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావుతో పాటు మంత్రి జగదీ్‌షరెడ్డి, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ప్రచారం చేయడంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లా క్లీన్‌ స్వీప్‌

తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులా బీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది. 2018లో జరిగిన ముందస్తు సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 స్థానాలకు గానూ హుజూర్‌నగర్‌, నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మిగతా తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పాగా వేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎ మ్మెల్యే గా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో 2019లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ఉత్తమ్‌ పద్మావతిపై 43,233 ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో 2021లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ తన సమీప ప్రత్యర్థి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిపై 18,872 ఓట్లతో గెలుపొందారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికను చాలెంజ్‌గా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నియోజకవర్గంలో తిష్ఠ వేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

చక్రం తిప్పిన మంత్రి జగదీ్‌షరెడ్డి

ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగ్గా, ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శిష్యుడిగా పేరొందడమే గాక పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఆయన వెంటనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ అక్కడి ప్రజలకు కావాల్సిన పథకాలు, అభివృద్థి, సంక్షేమ పథకాలు వంటివి అమలు చేస్తూనే మరోవైపు గులాబీ పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటూ నిత్యం ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఉప ఎన్నిక వచ్చిన సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ వంటి కార్యక్రమాలతో మైండ్‌ గేమ్‌ ద్వారా ఎదుటి పార్టీకి ప్రజాప్రతినిధులు లేకుండా చేశారు. అంతేగాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని విధంగా ఎత్తులు వేస్తూ వ్యూహంతో ముందుకు సాగుతూ ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు ఆయా ప్రాంతాల్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి పార్టీ గెలుపునకు వారు సహకరించేలా సమన్వయం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రంలోనే దిగ్గజాలుగా పేరొందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో చేరి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని వరుస ఉప ఎన్నికల్లో తన మంత్రాంగంతో మంత్రి జగదీ్‌షరెడ్డి ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు సాధించారు.

తొలిసారిగా కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా, సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా డిపాజిట్‌ గల్లంతైంది. అంతేగాక ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకొని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. తాజాగా ఓటమితో పార్టీ మరోస్థానం కోల్పోయింది. గతంలో కాంగ్రె స్‌కు కంచుకోటగా ఉన్న మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాత్రం డిపాజిట్‌ కోల్పోయారు. ఈ ఎన్నికలో ప్రధానంగా మహిళల ఓట్లపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. కాగా ఈ నియోజకవర్గంలో 1962 నుంచి 1985 వరకు కాంగ్రె్‌సనుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1999 వరకు సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో మళ్లీ కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందగా, 2009లో సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరిరావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎమ్మెల్యేగా 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి కూసకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లకే తన పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక వచ్చింది. చివరికి కాంగ్రె్‌సకు ఉన్న ఒక్కగానొక్క సీటును టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

సీఎం కేసీఆర్‌పై మునుగోడు ప్రజలకు విశ్వాసం

ుునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు ఉపఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం కౌంటింగ్‌ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని, ఏడాదిలోగా నియోజకవర్గాన్ని తనవంతుగా కృషి చేస్తానన్నారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకునేందుకు బాధ్యతగా పనిచేస్తానని, బీఆర్‌ఎ్‌సను ప్రజలు ఆమోదించారన్నారు. టీఆర్‌ఎస్‌ విజయంలో కీలక పాత్ర వహించిన ప్రజలకు, పార్టీ శ్రేణులు, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పతనానికి మునుగోడే నాంది అయిందని, ఆ పార్టీ ఎన్నికుట్రలు చేసినా ప్రజలు టీఆర్‌ఎ్‌సవైపే ఉన్నారన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌లాంటి నాయకుడు అత్యవసరమని, మునుగోడు నియోజకవర్గం దేశానికి వేగుచుక్కలా నిలిచిందన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని, మునుగోడు ఫలితం దేశ భవిష్యత్‌ను తెలిపిందన్నారు. డబ్బు, అహంకారంతో విర్రవీగిన రాజగోపాల్‌రెడ్డిని ఇంటికి పంపిన మునుగోడు ప్రజల చైతన్యం గొప్పదన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మునుగోడును అభివృద్ధి చేస్తానని రాజకీయాలకతీతంగా కృషి చేస్తానన్నారు. నిలిచిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమన్నారు. సంపూర్ణ సహకారం అందించిన వామపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్లను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, కిషోర్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తారుమారైన నేతల అంచనాలు

చౌటుప్పల్‌: మునుగోడు ఉపఎన్నికలో ఆదినుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రధానంగా పోటీపడ్డాయి. నియోజకవర్గంలో మొత్తం 2,41,367 ఓట్లకు 2,25,192 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో చౌటుప్పల్‌లో మండలంలోనే అత్యధిక ఓటర్లున్నారు. మండలంలో 59,419 ఓట్లకు 55,768 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ ఓటర్లలో 30శాతం ఓట్లు చౌటుప్పల్‌ మండలంలోనే ఉన్నాయి. దీంతో బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు చౌటుప్పల్‌ మండలంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. ఇక్కడ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. చౌటుప్పల్‌ పట్టణంతోపాటు మండల ఓటర్లు బీజేపీకి ఆధిక్యం ఇస్తారని ప్రచారం సాగింది. కానీ బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. చౌటుప్పల్‌ మండలంలో మొత్తం 59,419 ఓట్లకు 55,768 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎ్‌సకు 23,540 ఓట్లు, బీజేపీకి 22,990 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ 6,018 ఓట్లు సాధించింది. బీఎస్పీ 793 ఓట్లు సాధించింది. చౌటుప్పల్‌ మండలంలో బీజేపీ కన్నా టీఆర్‌ఎస్‌ 550 ఓట్లు ఎక్కువ సాధించింది.

ముగ్గురు మంత్రులు.. 22 మంది ఎమ్మెల్యేలు

చౌటుప్పల్‌ మునిసిపాలిటీతోపాటు మండలవ్యాప్తంగా ముగ్గురు మంత్రులు సహా 22మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలుగా నియమించింది. ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్లాన్‌ ప్రకారం ప్రచారం సాగించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. వీరు ఇన్‌చార్జిలుగా ఉన్న గ్రామాల్లో సైతం టీఆర్‌ఎ్‌సకన్నా బీజేపీకి రెండంకెల ఓట్లు అధికంగా వచ్చాయి.

తలసాని ప్రచారం చేసినా..

దేవరకొండ: మునుగోడు ఉపఎన్నికలో నాంపల్లి మండలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 13720 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 11,564 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 2,565 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మండలంలో 2,156 ఓట్ల మెజార్టీ వచ్చింది. నాంపల్లిలోని 295, 296, 294 పోలింగ్‌ బూత్‌లలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా బూత్‌ల పరిధిలో టీఆర్‌ఎ్‌సకు 325 ఓట్లురాగా, బీజేపీకి రాజగోపాల్‌రెడ్డికి 555 ఓట్లు వచ్చాయి. నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, నాంపల్లిలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

దయాకర్‌రావు ఇలాఖాలో బీజేపీ ఆధిక్యం

చండూరు: మునుగోడు ఉపఎన్నికలో చండూరు మునిసిపాలిటీకి చెందిన 2, 3 వార్డులకు పంచాయతీరాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈరెండు వార్డుల్లో మొత్తం 2023 ఓట్లు ఉండగా, అధికార పార్టీ టీఆర్‌ఎ్‌సకు 1132 ఓట్లు రాగా, బీజేపికి 1203 ఓట్లు వచ్చాయి. 71 ఓట్లు బీజేపీ ఆధిక్యంలో ఉంది.

అమ్ముడుపోయి మాపై విమర్శలా : సీపీఐ, సీపీఎం

నల్లగొండ, నల్లగొండ రూరల్‌ : కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమ్యూనిస్టులపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం అధికార పార్టీల వైపు పోవడం జిల్లాలో ఆయనకే చెల్లిందన్నారు. కాంట్రాక్టు పనుల కోసం కాంగ్రె్‌సను వదిలి కాషాయం జెండా కప్పుకున్న రాజగోపాల్‌కు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. 2018లో కాంగ్రె్‌సకు మద్దతిచ్చి గెలిపించామని, గెలిచిన తరువాత ఏనాడైనా వామపక్షాలను కలుపుకెళ్లలేదని అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే బీజేపీలోకి వెళ్లేందుకు రాజగోపాల్‌ ప్రయత్నం చేశాడని, ఏనాడూ మునుగోడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. కమ్యూనిస్టులు బలపర్చిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిస్టులను రాజగోపాల్‌రెడ్డి విమర్శించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బీజేపీ దక్షిణ తెలంగాణ జిల్లాలో బలపడడం కోసం కుట్ర పూరితంగా మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చిందని ఆరోపించారు. కమ్యూనిస్టుల 15వేలకు పైగా ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు దోహదపడ్డాయన్నారు.

ముగ్గురు మంత్రులు.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు

సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్‌నారాయణపురం మండలంలో సైతం టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సలు జోరుగా ప్రచారం సాగించాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీల తరఫున ఆయా పార్టీల నేతలు బాధ్యతగా తీసుకొని ప్రచారా న్ని కొనసాగించారు. బీజేపీ తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నీతానై వ్యవహరించారు. వీరికితోడుగా వివేక్‌ వెంకటస్వామి, రమేష్‌ రాథోడ్‌లు ప్రచారం సాగించారు. టీఆర్‌ఎస్‌ తరఫున ముగ్గురు మంత్రులు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలో మొత్తం 36,430 ఓట్లకు 34,155 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎ్‌సకు 13,587 ఓట్లు వచ్చా యి. బీజేపీ 11,755 ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ 5,679 ఓట్లు సాధించింది. బీజేపీపై టీఆర్‌ఎస్‌ మండలవ్యాప్తంగా 1,832ఓట్ల మెజార్టీ సాధించింది. మండలకేంద్రమైన సంస్థాన్‌నారాయణపురంలో 6173 ఓట్లు ఉండగా, అందులో 5,697 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎ్‌సకు 2,236, బీజేపీకి 2,243, కాంగ్రె్‌సకు 784ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎ్‌సపై బీజేపీ ఏడు ఓట్ల ఆధిక్యం సాధించింది. మండలంలో అత్యధికంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఇన్‌చార్జిగా ఉన్న గుడిమల్కాపురం ఎంపీటీసీ పరిధి టీఆర్‌ఎ్‌సకు 398ఓట్లు ఆధిక్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న మల్లారెడ్డిగూడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ 349 ఓట్ల లీడ్‌ ఇచ్చింది. తర్వాత స్థానంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇన్‌చార్జిగా ఉన్న పుట్టపాక ఎంపీటీసీ పరిధిలో 335ఓట్ల ఆధిక్యం సాధించింది. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇన్‌చార్జిగా ఉన్న పొర్లగడ్డ తండాలో బీజేపీ కన్నా టీఆర్‌ఎస్‌ 288 ఓట్లు అధికంగా వచ్చాయి. మంత్రి గంగుల కమలాకర్‌ ఇన్‌చార్జిగా ఉన్న సంస్థాన్‌ నారాయణపురం-1 ఎంపీటీసీ పరిధిలో బీజేపీకన్నా టీఆర్‌ఎ్‌సకు 66ఓట్ల మెజార్టీ లభించింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న సర్వేల్‌లో టీఆర్‌ఎస్‌ కన్నా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కన్నా టీఆర్‌ఎస్‌ 18ఓట్లు తక్కువగా వచ్చాయి. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఇన్‌చార్జిగా ఉన్న జనగాం పరిధిలో టీఆర్‌ఎస్‌ కన్నా బీజేపీ 174 ఓట్ల ఆధిక్యం కనబర్చింది. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న సంస్థాన్‌ నారాయణపురం ఎంపీటీసీ-2 పరిధిలో టీఆర్‌ఎస్‌ కన్నా బీజేపీ 73ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. మండలంలో ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలుగా ఉన్నా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Updated Date - 2022-11-07T01:14:54+05:30 IST

Read more