నేటినుంచి టీడీ వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2022-11-07T00:51:05+05:30 IST
కొవిడ్ అ నంతరం ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను ధ నుర్వాతం, కోరింత దగ్గు (డిప్తీరియా) బెంబేలెత్తిస్తోంది. 2015లో దేశంలో 35 శాతంగా ఉన్న డిప్తీరియా ఈ సంవత్సరానికి 65 శాతానికి చేరినట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో సమస్య పరి ష్కారం కోసం 10ఏళ్లు, 16 ఏళ్ల పిల్లలందరికీ టీడీ వ్యాక్సినేషన్‌ను చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 12 రోజు ల పాటు(ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు) కొనసాగనుంది.
ఉమ్మడి జిల్లాలో 80వేల మంది పిల్లలకు పంపిణీ లక్ష్యం
భువనగిరి టౌన్, నవంబరు 6: కొవిడ్ అ నంతరం ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను ధ నుర్వాతం, కోరింత దగ్గు (డిప్తీరియా) బెంబేలెత్తిస్తోంది. 2015లో దేశంలో 35 శాతంగా ఉన్న డిప్తీరియా ఈ సంవత్సరానికి 65 శాతానికి చేరినట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో సమస్య పరి ష్కారం కోసం 10ఏళ్లు, 16 ఏళ్ల పిల్లలందరికీ టీడీ వ్యాక్సినేషన్‌ను చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 12 రోజు ల పాటు(ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు) కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన సుమారు 80వేల మంది చిన్నారులు, విద్యార్థులకు డిప్తీరియా టీకాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వైద్యాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. డిప్తీరియా వ్యాధికి గురైన వారు ఎడతెరిపి లే కుండా దగ్గడం, కళ్లవెంట నీరు కారడం, తీవ్ర అనారోగ్యానికి గురవుతా రు. పిల్లల్లో ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆ స్పత్రులకు తీసుకెళ్తే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వైద్య చికిత్సలు అందిస్తారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లల ప్రాణాల కు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీడీ వ్యాక్సినేషన్‌ను విధిగా పిల్లలకు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
5వ, 10వ తరగతి విద్యార్థులందరికీ....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 10 ఏళ్ల వయస్సు గల 5వ తరగతి విద్యార్థులకు, 16 సంవత్సరా లు గల 10వ తరగతి విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్ ఇస్తారు. బడి వె లుపల గల ఆ వయస్సు గల పిల్లలకు సమీపంలోని అంగన్‌వాడీ కేం ద్రాలు, పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్ చేస్తారు. ఇందుకోసం వైద్య బృందాలను అధికారులు నియమించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీడీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఉమ్మడి జిల్లా వైద్యాధికారులకు కేంద్ర, రాష్ట్ర వైద్యశాఖలు ల క్ష్యాన్ని విధించాయి. పిల్లల ఎడమ చేతికి ఇచ్చే టీడీ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, కొద్దిమందికి స్వల్ప జ్వర లక్షణాలు వస్తాయ ని వైద్యులు అంటున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు మాత్రం వైద్య నిపుణుల సూచనల అనంతరమే టీడీ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read more