ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్టుగా గంజాయి విక్రయాలు

ABN, First Publish Date - 2022-12-17T00:33:34+05:30

జిల్లాకు గంజాయి రవాణా ఆగడంలేదు. పోలీసులు అన్ని మార్గాలను మూసివేస్తున్నా.. కొత్త మార్గాల ద్వారా జిల్లాకు తీసుకువస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇతర జిల్లాల నుంచి తెచ్చి అమ్మకాలు

భీంగల్‌, కమ్మర్‌పల్లి పరిధిలో కేసులు నమోదు చేసిన అధికారులు

సరిహద్దు ప్రాంతాలపై నిఘాపెట్టిన పోలీసులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాకు గంజాయి రవాణా ఆగడంలేదు. పోలీసులు అన్ని మార్గాలను మూసివేస్తున్నా.. కొత్త మార్గాల ద్వారా జిల్లాకు తీసుకువస్తున్నారు. అమ్మకాలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దులు, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా కొనసాగిస్తున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ ఉంచి వివిధ మార్గాల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నారు. తమను అడిగిన వారికి గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఈ సరఫరాపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు నజర్‌పెట్టినా ఆగడంలేదు. కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ మధ్యనే కొన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో అమ్మకాలు చేస్తున్నవారిని పట్టుకున్నారు. కేసులను నమోదు చేశారు. కొన్ని చోట్ల తమకున్న పలుకుబడిని, కొంతమంది నేతల సహకారం తీసుకుని ఈ దందాను కొనసాగిస్తున్నారు.

యథేచ్ఛగా విక్రయాలు..

జిల్లాలో గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదిలాబాద్‌ జిల్లా నుంచేకాకుండా ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చి ఈ అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఎక్కువగా జిల్లాకు సరఫరా చేస్తున్నారు. పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు వివిధ మార్గాల ద్వారా పెద్ద వాహనాలు ఉపయోగించకుండా పంపిణీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సరుకులు సరఫరా చేసే వాహనాల ద్వారా ఈ సరఫరాను కొనసాగిస్తున్నారు. ఏపీ నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి సరఫరా అవుతుండడంతో వారితో కాంటాక్ట్‌ పెట్టుకుని ఈ దందాను కొనసాగిస్తున్నారు. ముఖ్యం గా యువతను టార్గెట్‌గా చేసుకుని ఈ గంజాయి సరఫరా చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాలు, కొన్నిషాప్‌ల ద్వారా ఎంపిక చేసిన వారికి సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్మకాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని భీంగల్‌, కమ్మర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 10 రోజుల క్రితం గంజాయి అమ్మకందారులను, కొనుగోలు చేసేవారిని పట్టుకున్నారు. కేసులను నమోదు చేశారు. రిమాండ్‌కు తరలించారు. నాలుగు నెలల క్రితం జిల్లా మీదుగా గంజాయి తరలింపుకు పాల్పడ్డ రాజస్థాన్‌కు చెందిన వారిని కూడా జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

జిల్లాలోని ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల పరిదిలో ఈ గంజాయి అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారుల సమాచారం బట్టితెలుస్తోంది. ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు గుర్తించారు.

యువకులే టార్గెట్‌

జిల్లాలో ఎక్కువగా మైనర్‌, మేజర్‌ అయిన యువతనే ఎక్కువగా గంజాయికి అలవాటుపడ్డారు. అదిలేనిదే ఉండని పరిస్థితికి వచ్చారు. మున్సిపాలిటీలతో పాటు కొన్ని గ్రామాల పరిధిలో కూడా గంజాయి అలవాటు పెరిగింది. చిన్న చిన్న దుకాణాల్లో కూడా దొరుకతుండడంతో ఎక్కువమంది అలవాటుపడుతున్నారు. మొదట మత్తుకోసం తీసుకుంటున్న యువకులు తర్వాత దానికి అడిక్ట్‌ అవుతున్నారు. డబ్బులు పెడితే అన్నిచోట్ల దొరుకుతుండడంతో ఎక్కువమంది ఈ అలవాటుకు లోనవుతున్నారు. అమ్మకాలు చేస్తున్నవారు చిన్న వయసులోనే వారిని గంజాయి మత్తుకు అలవాటు చేస్తున్నారు. తక్కువ ధరకే అమ్మకాలు చేస్తూ వారిని అలవాటయ్యేవిదంగా చూస్తున్నారు. సిగరేట్‌లుపెట్టుకుని తాగేందుకుఅనువుగా చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకాలను కొనసాగిస్తున్నారు.

జిల్లాలో గత కొన్ని నెలలుగా పోలీసులు ఈ గంజాయి రవాణాపై నిఘా కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో సరఫరా చేసేవారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పెద్దవారు తప్పించుకుంటు చిన్న మొత్తంలో అమ్మకం చేసేవారి ద్వారా సరఫరా కొనసాగిస్తున్నారు.

బాల్కొండలో గంజాయి పట్టివేత

బాల్కొండ: ఆదిలాబాద్‌ నుంచి గంజాయిని తరలిస్తున్న వ్యక్తి నుంచి శుక్రవారం అరకిలో పట్టుకు న్నట్టు ఎస్సై గోపి తెలిపారు. ఆదిలా బాద్‌ జిల్లా నేరెడిగొండ మండలం బోర్గం గ్రామానికి చెందిన రాథోడ్‌ దూద్‌గాం గంజాయిని తరలిస్తున్నా డన్న సమాచారంతో అతని పట్టుకున్నామని తెలిపారు. ఆర కిలో ఎండి గంజాయిని స్వాధీనపర్చుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించి నట్టు ఎస్సై పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారు రూ.5వేలు ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-17T00:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising