ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-10-28T00:23:17+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 27: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఈసీలతో సెల్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నంలోగా క్షేత్ర సహాయకులకు శిక్షణ పూర్తిచేయాలన్నారు. రోజువారి సాధారణ విధులు నిర్వహిస్తూనే హరితహారం, ఉపాధిహామీ కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించడం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, పల్లెప్రకృతి వనాలు, బృహత్‌, మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, హరితవనాలు, నర్సరీల ఏర్పాటుపై ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు వారు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల గురించి శిక్షణ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు లేని పక్షంలో సీనియర్‌ మేట్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు. గత ఏడాదికంటే ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. ఫార్మేషన్‌రోడ్‌లకు ప్రాధాన్యతనివ్వాలని సోమవారం నుంచి ప్రతి జీపీ పరిదిలో కనీసం రెండు రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. నవంబరు 15లోగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మొత్తం 660 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం కింద జిల్లాకు రూ.2కోట్ల నిధులు మంజూరైనందున నిర్దేశిత ప్రాంతా ల్లో పనులను తక్షణమే ప్రారంభించేలా చొరవచూపాలన్నారు. భీంగల్‌ మండలం రహత్‌నగర్‌, కారేపల్లి, తాళ్లపల్లి, ఇందల్‌వాయి మండలం వెంగల్‌పహాడ్‌, రంజిత్‌నాయక్‌తండా, మోపాల్‌ మండలం ఎల్లమ్మకుంట తండా, సిరికొండ మండలం పందిమడుగు, పాకాల, నవీపేట మండలం అబ్బాపూర్‌(బి), వర్ని మండలం షంకోర తండాలో ఆయా పనులను వెంటనే ప్రారంభించి సాధ్యమైంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

31న జిల్లాకు ఆల్‌ ఇండియా సర్వీసెస్‌

ట్రైనీ అధికారుల బృందం రాక

నిజామాబాద్‌అర్బన్‌: ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ట్రైనీ అధికారుల బృందం శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యాయనం చేసేందుకు 31న జిల్లాకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం సంబంధిత అధికారులతో సెల్‌కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ట్రైనీ అధికారులతో కూడిన బృందాలు జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక, కోటగిరి మండలం ఎత్తొండ, ఆలూరు మండలం మిర్దాపల్లి, జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌, కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌ గ్రామాల్లో ఈ నెల 31 నుంచి 5వ తేదీ వరకు బస చేస్తారన్నారు. అధికారులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉండేలా ఎంపీడీవోలు చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు, పల్లెప్రగతి వంటి పథకాలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంఘాల పనితీరు వంటి అంశాలను ఈ బృందాలు పరిశీలించనున్న దృష్ట్యా అవసరమైన సమాచారం రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 30 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ సూచించారు. సెల్‌కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డీఆర్‌డీఓ చందర్‌నాయక్‌, డీపీవో జయసుధ, ఏసీపీలు, ఆర్‌డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-28T00:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising