ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆభరణాల కోసం హత్యలు!

ABN, First Publish Date - 2022-12-26T01:17:22+05:30

జిల్లాలో రోజురోజుకూ హత్య కేసులు పెరుగుతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఆభరణాల కోసం దొంగలు హత్య, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్‌

జిల్లాలో వరుస ఘటనలు

పోలీసులకు సవాలుగా మారిన కేసులు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

బోధన్‌ రూరల్‌, డిసెంబరు 25: జిల్లాలో రోజురోజుకూ హత్య కేసులు పెరుగుతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఆభరణాల కోసం దొంగలు హత్య, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామాల్లో రాత్రి అయిందంటే చాలు ఒంటరి మహిళలు, గ్రామ శివారులో నివసించే కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కంటి మీద నిద్ర లేకుండా రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయంభయంగా రోజులు గడుపుతున్నారు. ఇటీవల బోధన్‌ డివిజన్‌లోని అమ్దాపూర్‌ గ్రామంలో ఒంటరి మహిళపై ఉన్న బంగారంపై కన్నేసి దుండగులు ఏకంగా హత్య చేసి ఆభరణాలు దోచుకోవడమే కాకుండా ఆనవాళ్లు దొరకుండా మృతదేహం చుట్టూ కారం పొడి చల్లారు. అయితే పోలీసులకు సవాల్‌గా మారిన ఈ ఘటన మరువక ముందే రెంజల్‌ మండల కేంద్రంలోని సరస్వతీనగర్‌లో నివాసముండే వృద్ధ దంపతులపై హత్య యత్నం చేసి వారి వద్ద ఉన్న ఆభరణాలను దొంగిలించారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ను రప్పించినప్పటికీ కారం పొడి చల్లడంతో ఘటనలను ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇటీవల తరచూ దొంగతనాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

బోధన్‌ డివిజన్‌లో పెరుగుతున్న కేసులు

ఫ బోధన్‌, రెంజల్‌ మండలాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలో అమ్దాపూర్‌, రెంజల్‌లో బంగారు ఆభరణాల కోసం ఘటనలు నెలకొన్నాయి. అమ్దాపూర్‌లో ఒంటరి మహిళను హత్యచేసి ఆభరణాలు దొంగిలించారు. రెంజల్‌ మండలంలో వృద్ధ దంపతులపై హత్య యత్నానికి పాల్పడి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో అమ్దాపూర్‌లో మహిళ మృతి చెందగా రెంజల్‌లోని వృద్ధ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ ముఠా పకడ్బందీతోనే ఈ తరహా దాడులకు పాల్పడుతుందని పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా, నిందితులను ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-26T01:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising