ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు రావు.. వేతనాలు లేవు

ABN, First Publish Date - 2022-10-27T01:59:13+05:30

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు రాక.. వేతనాలు లేక అభివృద్ధి కుంటుపడిపోతోంది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడు నెలలుగా కేంద్రం.. రెండు నెలలుగా రాష్ట్రం నిధులు విడుదల చేయని వైనం

గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులు

పేరుకుపోయిన బకాయిలు

జీతాలు, ఖర్చులు, ఇతర చెల్లింపులకు పంచాయతీలకు తప్పని ఇబ్బందులు

నిజామాబాద్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు రాక.. వేతనాలు లేక అభివృద్ధి కుంటుపడిపోతోంది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. కొన్ని పంచాయతీల పరిధిలో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా నిధుల విడుదలకాకపోవడంతో పంచాయతీల పరిధిలో నెలవారి ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం నుంచి ఏడు నెలలుగా.. రాష్ట్రం నుంచి రెండు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో అభి వృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.

ఫ జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీలు

జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలకు ప్రతి నె లా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకావాల్సి ఉంది. జనాభా దామాషా ప్రకారం ఆయా గ్రామ పంచాయతీల కోసం ప్రతి నెలా జిల్లాకు పది కోట్ల వరకు ఈ నిధులు కేటాయిస్తున్నారు. కేంద్రం నుంచి ప్రతి నెలా 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. అయితే ఏప్రిల్‌ నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదే శాలు ఇచ్చింది. అన్ని గ్రామ పంచాయతీల అకౌంట్‌లకే డబ్బులు జమచేస్తామని పేర్కొంది. ఆ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలను తెరిచి వివరాలను కేంద్రానికి పంపించారు.

ఫ ఏడు నెలలుగా విడుదల కాని కేంద్రం నిధులు

జిల్లాకు కేంద్రం వాటా ఏడు నెలల్లో సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు రెండు నెలలుగా నిధుల విడుదల చేయలేదు. దీంతో పంచాయతీల పరిధిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివిధ పథకాల కింద చేపట్టిన పనులు పూర్తిచేయలేని పరిస్థితి ఉంది. అలాగే పం చాయతీ సిబ్బందికి జీతాలను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

ఫ పేరుకుపోయిన బకాయిలు

గ్రామ పంచాయతీ పరిధిలో కరెంటు బిల్లుల చెల్లింపులు, ట్రాక్టర్‌కు బకాయిలు, సిబ్బంది వేతనాలు పేరుకుపోయాయి. కేంద్రంతో పాటు రాష్ట్రం నిధుల చెల్లింపులు నిలిచిపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నిధులు వచ్చేవిధంగా చూడాలని కోరారు. ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదలవుతేనే గ్రామాల్లో కనీస పను లు చేసే అవకాశం ఉంటుందని సర్పంచ్‌లు వాపోతున్నారు. త్వరగా ని ధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

ఫ త్వరలోనే నిధుల విడుదల..

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఏడు నెలల నుంచి కేంద్రం నిధులు రావడంలేదని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదలవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా మూడు రోజుల్లో పంచాయతీల ఖాతాలో జమచేస్తారని తెలిపారు. సమస్యలు ఏర్ప డకుండా నిధుల సర్దుబాటు చేస్తున్నామని ఆమె తెలిపారు.

Updated Date - 2022-10-27T01:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising