మధ్యతరగతి వారికోసమే మల్లారంలో లే అవుట్
ABN, First Publish Date - 2022-10-29T00:54:51+05:30
ఉద్యోగులు, మధ్యతరగతి వారి కోసం నగరాన్ని ఆనుకుని ఉన్న మల్లారంలో లేవుట్‌ను అభి వృద్ధి చేశామని, వచ్చే నెల 14న వేలం పాట నిర్వహించి ప్లాట్ల కేటాయింపు చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
నిజామాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉద్యోగులు, మధ్యతరగతి వారి కోసం నగరాన్ని ఆనుకుని ఉన్న మల్లారంలో లేవుట్‌ను అభి వృద్ధి చేశామని, వచ్చే నెల 14న వేలం పాట నిర్వహించి ప్లాట్ల కేటాయింపు చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ధాత్రి టౌన్‌షిప్‌పై ప్రిబిడ్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న లేవుట్‌లో కావాల్సిన ఏ ర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మల్లారం అటవీ ప్రాంతం పరిధిలో ప్రభుత్వ భూమిలో 32 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మొదటి విడతగా 80 కోట్లకు వచ్చే నెల 14, 15 తేదీ ల్లో వేలం నిర్వహిస్తున్నామన్నారు. గజం 8వేల రూపాయలుగా నిర్ణయించామన్నారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయల డీడీతో ఆరోజు వరకు వచ్చి నమోదు చేసుకుంటే అవకాశం కల్పిస్తామన్నారు. నిర్ణయించిన ధరతో పాటు వేలంలో పొందిన వారికి డబ్బులు చెల్లించేందుకు 90 రోజుల సమయం ఇస్తామన్నారు. మొత్తం 76 ఎకరాల్లో ఈ లేవుట్ చేస్తున్నామని మొదట 32 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ టౌన్‌షిప్‌లో 200, 300 గజాల ప్లాట్లను వేలం వేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రమిశ్రా, ఆర్‌డీవో రవి, టీఎస్‌ఐఐసీ జిల్లా మేనేజర్ రాందాసు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ నిర్మాణదారులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో 114 పాఠశాలల్లో కొనసాగుతున్న ‘మన ఊరు-మన బడి’ పనులను వారంలో పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరు-మన బడి’ పనులపై సమీక్షించారు. జిల్లాలో తుది విడుతలో మంజూరైన 114 పాఠశాలల్లో ఏ ఒక్క సివిల్ వర్క్ పెండింగ్‌లో ఉండకూడదని ఆయన అధికారులకు సూచించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీఈవో దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లంపీస్కిన్ వ్యాధిపై అవగాహన పోస్టర్ విడుదల
నిజామాబాద్‌అర్బన్: పశువుల్లో వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. వ్యాధిని అరికట్టేందుకు పశువులకు టీకాలు వేయాలని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జగన్నాథచారి, సహాయ సంచాలకులు డాక్టర్ బాలిక్ అహ్మద్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్‌ల పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రద్దానంద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. శుక్రవారం వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్‌ను తెరిచి ఈవీఎం లు, బ్యాలెట్‌యూనిట్‌లు, ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులు పలు సూచనలు ఇచ్చారు. బ్యాలెట్‌యంత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోడౌన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ఆయన కోరారు. కలెక్టర్ వెంట ఎన్నికల నిర్వహణ పర్యవేక్షకులు పవన్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-29T00:54:52+05:30 IST