MLC Kavitha: కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు
ABN, First Publish Date - 2022-11-07T19:44:48+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తెలిపారు. ఏ ఎన్నికలైన కేసీఆర్ పక్షానే ప్రజలు నిలుస్తారని మరోమారు నిరూపించారని చెప్పారు.
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తెలిపారు. ఏ ఎన్నికలైన కేసీఆర్ పక్షానే ప్రజలు నిలుస్తారని మరోమారు నిరూపించారని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా సోమవారం నిజామాబాద్ (Nizamabad) జిల్లాకేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసం రోజున తెలంగాణ ప్రజలు అద్భుతమైన ఫలితాన్ని అందజేశారని, కేసీఆర్ను ఆశీర్వదిస్తూ మునుగోడు ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. గత కొన్ని రోజులుగా అవాక్కులు, చెవాక్కులు పేలినటువంటి వారి నోర్లు మూతపడేలా ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ (TRS BRS) కు పట్టం కట్టారని కొనియాడారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వానికి మద్దతు పలికిన మునుగోడు ప్రజలకి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తెలంగాణలో నల్గొండలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించామని.. ఇకముందు తెలంగాణలో ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్దే విజయమని కవిత ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-07T19:44:48+05:30 IST