ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ ముందుకు

ABN, First Publish Date - 2022-12-13T00:26:34+05:30

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుందని ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, డిసెంబరు 12: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుందని ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. సోమవారం డిచ్‌పల్లి మండలం 8 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇంత వరకు ఏ ఒక్కరికైన పీఎం రిలీఫ్‌ ఫ్‌ండ్‌(ప్రధానమంత్రి సంక్షేమ నిధి) ద్వారా ఇప్పించారా? ప్రశ్నించారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన సుమలతకు రూ.2లక్షలు, ధర్మారం(బి)కి చెందిన స్వాతికి రూ.1.50లక్షలు, ఘన్‌పూర్‌కు చెందిన గంగాధర్‌కు రూ.1.50లక్షలు, సాంపల్లికి చెందిన మల్లేశ్‌కు రూ.3లక్షలు, ఘన్‌పూర్‌కు చెందిన సిసింద్రికి రూ.లక్ష, కమలపూర్‌కు చెందిన దివ్యకు రూ.1.50లక్షలు, నడిపల్లికి చెందిన అరుణకురూ.1.28లక్షలు, అమృతాపూర్‌కు చెందిన మమతకు రూ.2.25లక్షల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఇందిరా లక్ష్మీ నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising