ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Miheeka Bajaj: సంతోషంగా ఉన్నాం.. ప్రెగ్నెన్సీ వార్తలపై రానా భార్య!

ABN, First Publish Date - 2022-10-29T13:47:41+05:30

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati), మిహీకా బజాజ్ (Miheeka Bajaj) పేరేంట్స్ కాబోతున్నారంటూ.. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తపై

Rana Daggubati and Miheeka Bajaj
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati), మిహీకా బజాజ్ (Miheeka Bajaj) పేరేంట్స్ కాబోతున్నారంటూ.. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నేషనల్ మీడియా కూడా ఈ వార్తను ప్రచురించింది. అయితే అటు రానా ఫ్యామిలీ (Rana Family) కానీ, ఇటు మిహీకా ఫ్యామిలీ (Miheeka Family) నుంచి కానీ ఈ వార్తపై ఎవరూ స్పందించలేదు. రానా, మిహీకా (Rana and Miheeka)లకు 8 ఆగస్ట్ 2020న మ్యారేజ్ జరిగింది. ఈ మధ్య వీరిద్దరూ విడిపోతున్నారనేలా కూడా రూమర్స్ వినిపించాయి. అప్పుడు కూడా ఇరు ఫ్యామిలీలు వ్యక్తులు కామ్‌గానే ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడల్లా.. మిహీకా ఇంటిలో రానా ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఫెస్టివల్స్ సమయంలో మిహీకా ఇంటిలో రానా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆ ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ వస్తున్నారు. అందుకేనేమో.. మనమెవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లుగా.. ఎన్ని రూమర్స్ వచ్చినా.. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా వినిపిస్తోన్న ప్రెగ్నెన్సీ వార్తలపై మాత్రం మిహీకా బజాజ్ (Miheeka Bajaj Pregnant Rumours) సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అవి కేవలం రూమర్స్ మాత్రమే అన్నట్లుగా ఆమె సమాధానమిచ్చింది.

సోషల్ మీడియాలో ఆమె ఫాలో అవుతున్న ఓ నెటిజన్.. ‘మీరు ప్రెగ్నెంటా?’ అని ప్రశ్నించగా.. ‘‘just happily married so become a little healthy’’ అంటూ మిహీకా సమాధానమిచ్చింది. ప్రస్తుతం సంతోషకరమైన వివాహ బంధంలో ఉన్నాం.. ఇలా కాస్త ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండనీయండి.. అంటూ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అనేలా మిహీకా సమాధానమిచ్చింది. దీంతో రానా, మిహీకా దంపతులు పేరేంట్స్ కాబోతున్నారనే వార్తలకు బ్రేక్ వేసినట్లయింది. అంతేకాదు, ఆమె ఇచ్చిన ఈ సమాధానంతో.. వారిద్దరూ విడిపోతున్నారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చినట్లయిందంటూ దగ్గుబాటి అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సమాధానంతో రెండు ప్రశ్నలకు మిహీకా సమాధానమిచ్చిందని అంతా అనుకుంటుండటం గమనార్హం.

Updated Date - 2022-10-29T13:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising