ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎయిడ్స్‌’ నిర్మూలన ప్రజల చేతుల్లోనే..

ABN, First Publish Date - 2022-12-02T00:03:49+05:30

ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రజల చేతుల్లోనే ఉందని, మందులేని ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

వికారాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రజల చేతుల్లోనే ఉందని, మందులేని ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి డైట్‌ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో పల్వన్‌కుమార్‌ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సురక్షిత లైంగిక సంబంధాలతోనే ఎయిడ్స్‌ నిర్మూలన సాధ్యం అన్నారు. వివాహేతర సంబంధాలు, అసురక్షిత లైంగిక సంబంధాలతో హెచ్‌ఐవీ ప్రబలే ఆస్కారం ఉందన్నారు. వైరస్‌ బారిన పడిన వారు అధైర్యపడకుండా వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడుతూ సాధారణ జీవితాన్ని గడపొచ్చని అదనపు కలెక్టర్‌ సూచించారు.

ఎయిడ్స్‌ రాకుండా నివారణ ఒక్కటే మార్గం : ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌

ఎయిడ్స్‌కు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. డైట్‌ కళాశాలలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎక్కువగా యువతే ఎయిడ్స్‌ బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వో పల్వన్‌కుమార్‌ మాట్లాడుతూ.. సురక్షిత సంభోగం వల్ల ఈ వ్యాధి రాదని, సురక్షితమైన సూదులు, రక్తమార్పిడి వల్ల ఈ వ్యాధి రాదన్నారు. హెచ్‌ఐవీ తల్లి నుంచి గర్భస్త శిశువుకు రాకుండా ఏఆర్‌టీ మందులు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, ప్రతిభ చూపిన ఉద్యోగులకు సన్మాన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అంటు వ్యాధుల నివారణ అఽధికారి డాక్టర్‌ రవీందర్‌, డీఐవో డాక్టర్‌ జీవరాజ్‌, డాక్టర్‌ లలిత, డాక్టర్‌ పవిత్ర, డాక్టర్‌ మరియ, డాక్టర్‌ అరవింద్‌, డీఎంఎంవో అంజయ్య, చంద్రశేఖర్‌, రేణుకుమార్‌, రజిత, వైద్యాధికారులు, వైద్య పర్యవేక్షణాధికారులు, మహావీర్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థులు, ఆరోగ్య, ఆశా, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising