TS News: ఆడపిల్ల పుట్టిందంటూ భార్యను వదిలేసిన సాఫ్ట్‌వేర్

ABN , First Publish Date - 2022-11-07T10:38:46+05:30 IST

సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పెరుగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటూ భార్యలను వదిలేసిన ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి.

TS News: ఆడపిల్ల పుట్టిందంటూ భార్యను వదిలేసిన సాఫ్ట్‌వేర్

రంగారెడ్డి: సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పెరుగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటూ భార్యలను వదిలేసిన ఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి అమానుష ఘటనే జిల్లాలోని గండిపేట మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయిన రాహుల్.. ఆడపిల్లకు జన్మనిచ్చిందంటూ కట్టుకున్న భార్యను పుట్టింటిలో వదిలేశాడు. తనకు ఆడపిల్ల వద్దని... విడాకులు ఇస్తే వేరే వివాహం చేసుకుంటానంటూ భార్యకు షాక్ ఇచ్చాడు. 18 నెలల‌ క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాహుల్‌తో శకుంతల వివాహం జరిగింది. వివాహ సమయంలో కోటిన్నర ఖరీదైన ప్లాట్, 50 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు కట్నంగా ఇచ్చి శకుంతల తల్లిదండ్రులు ఎంతో వైభవంగా వివాహం జరిపించారు. ఇటవలే శంకుతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆడబిడ్డ పుట్టడమే తప్పయినట్టు రాహుల్ కుటుంబసభ్యులు మాట్లాడుతున్నారని... ఇప్పటి వరకు కనీసం బిడ్డను చూడలేదని శంకుతల ఆవేదన వ్యక్తం చేస్తోంది. బిడ్డ తనకు పుట్టలేదని భర్త, అత్తమామలు అంటున్నారని... చంటి‌ బిడ్డను తీసుకొని వెళితే ఇంటికి తాళం‌ వేసి వెళ్లిపోయారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు శకుంతల వేడుకుంటోంది.

Updated Date - 2022-11-07T12:54:11+05:30 IST

Read more