అర్బన్ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి
ABN, First Publish Date - 2022-10-23T01:02:29+05:30
రాష్ట్రంలోని జాతీయ బ్యాం కులకు ధీటుగా సేవలందిస్తున్న కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సేవ లను వినియోగించుకోవాలని తెలంగాణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాం కు ఫెడరేషన్ అధ్యక్షుడు వేంరెడ్డి నర్సింహారెడ్డి కోరారు.
భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 22: రాష్ట్రంలోని జాతీయ బ్యాం కులకు ధీటుగా సేవలందిస్తున్న కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సేవ లను వినియోగించుకోవాలని తెలంగాణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాం కు ఫెడరేషన్ అధ్యక్షుడు వేంరెడ్డి నర్సింహారెడ్డి కోరారు. భూదాన్‌పో చంపల్లిలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 25వ వార్షికో త్సవం పురస్కరించుకుని శనివారం ‘సిల్వర్ జూబ్లీ’ ఉత్సవాలు నిర్వ హించారు. అర్బన్ బ్యాంకులు అన్ని వర్గాల ప్రజల ప్ర యోజనం మేరకు విశేష సేవలు అందిస్తున్నాయన్నారు. పోచంపల్లి అర్బన్ బ్యాంకు ప్రతి ఏటా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం అం దుకు తార్కాణమన్నారు. బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్ మా ట్లాడుతూ బ్యాంకు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు బడుగు, బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు వారి అవస రాల మేరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. డిపా జిట్ల ప్రయోజనార్థం అత్యధిక వడ్డీని అందిస్తున్నామని తెలిపారు. 12 సంవత్సరాలుగా వరుసగా జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంకు అ వార్డులు పొందినట్లు వివరించారు. సమావేశంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, డీసీవో పరిమళాదేవి, జిల్లా చేనేత నాయకులు తడక వెంకటేష్, బ్యాంకు మాజీ చైర్మన్లు కర్నాటి పాండు, చిట్టిపోలు శ్రీనివాస్, వైస్ చైర్మన్ సూరపల్లి రమే ష్, బ్యాంకు డైరెక్టర్లు సీత దామోదర్, బోగ విజయ్‌కుమార్, చిక్క క్రిష్ణ, పున్న లక్ష్మీనారాయణ, కొండమడుగు ఎల్లస్వామి, కడవేరు కవిత, పిల్లలమర్రి అర్చన, వేణు, భాస్కర్, తడక రమేష్ ఉన్నారు.
Updated Date - 2022-10-23T01:02:50+05:30 IST