ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య

ABN, First Publish Date - 2022-11-08T22:36:23+05:30

మాట మార్చడం, మడమ తిప్పడం సీఎం కేసీఆర్‌(Cm Kcr)కి వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు. మంగళవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు ఆ వార్తను యథాప్రకారం పోస్ట్ చేస్తున్నాం.‘‘కేసీఆర్‌కి ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాట మార్చడం, మడమ తిప్పడం సీఎం కేసీఆర్‌(Cm Kcr)కి వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు. మంగళవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు ఆ వార్తను యథాప్రకారం పోస్ట్ చేస్తున్నాం. ‘‘కేసీఆర్‌కి ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయింది. హుజురాబాద్ ఎన్నికలప్పుడు (Huzurabad Elections) ఆగమేఘాల మీద దళిత బంధు(Dalita Bandhu) పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల తర్వాత దాన్ని పట్టించుకోవడం లేదు. మునుగోడు ఎన్నికల(Munugode Elections) నేపథ్యంలో గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకాన్ని (Nagadhu Badili)ప్రవేశపెట్టింది. మునుగోడు ఉపఎన్నికతో పాటే గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకం కూడా ముగిసింది. మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలను పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం(Kcr Govt) నిర్ణయించింది. నగదు బదిలీలో భాగంగా మునుగోడు పరిధిలో ఉన్న 4,739 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖతాల్లో అధికారులు నగదు జమ చేశారు. మరో 1,525 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా... ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో నగదు బదిలీకి బ్రేక్‌ పడింది. అప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమైన లబ్ధిదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బు విత్‌ డ్రా చేసుకోకుండా కూడా ఫ్రీజ్‌ చేశారు. ఎన్నిక పూర్తైన తర్వాత లబ్ధిదారులు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ సర్కారు యూటర్న్‌ తీసుకోవడంతో మునుగోడులోని లబ్ధిదారులకు నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఏం కేసీఆర్ ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు. మీరు చేసే మోసపు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో నీకు, నీ సర్కార్‌కు తగిన సమాధానం చెప్పడం ఖాయం’’ అని విజయశాంతి హెచ్చరించారు.

Updated Date - 2022-11-08T22:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising