Minister Errabelli: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి..
ABN, First Publish Date - 2022-12-26T15:37:50+05:30
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి ఆధ్వర్యంలో 3 వేల మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు (Sewing Machines) పంపిణీ చేశారు.
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి ఆధ్వర్యంలో 3 వేల మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు (Sewing Machines) పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఫైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakararao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. డ్వాక్రా సంఘాలతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. తాను నామినేషన్ వేస్తున్నప్పుడు ఆ ఖర్చును మహిళలే రూపాయి రూపాయి కూడబెట్టి ఇచ్చారని చెప్పారు. మహిళలకు రూ. 3 లక్షల రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చి, శిక్షణ ఇస్తున్నామన్నామన్నారు. ఫైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నామని.. ఈపథకాన్ని తెలంగాణ అంతటా విస్తరిస్తామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-26T15:37:54+05:30 IST