పంజాబీ లస్సీ
ABN , First Publish Date - 2022-05-11T17:34:45+05:30 IST
పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.
కావలసినవి: పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.
తయారీ విధానం: ముందుగా పెరుగును మిక్సీలో వేసి పట్టుకోవాలి.తరువాత పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేయాలి.ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలుపుకోవాలి. మరొక్కసారి బ్లెండ్ చేసుకుని గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేయాలి.