ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కబాబ్స్‌

ABN, First Publish Date - 2022-05-14T18:54:13+05:30

ఖీమా - 150గ్రాములు, చికెన్‌ బోన్‌లెస్‌ - 100గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసినవి: ఖీమా - 150గ్రాములు, చికెన్‌ బోన్‌లెస్‌ - 100గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, శొంఠిపొడి - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, జీడిపప్పు పేస్టు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, క్రీమ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌,  శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కోడిగుడ్డు పచ్చసొన - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - గార్నిష్‌ కోసం ఒకకట్ట.


తయారీ విధానం: ఒక బౌల్‌లో ఖీమా, చికెన్‌ వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఆమ్‌చూర్‌పౌడర్‌, శొంఠిపొడి, జీడిపప్పు పేస్టు, క్రీమ్‌, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.తరువాత శనగపిండి, కోడిగుడ్డు వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు పెట్టాలి.ఇప్పుడు మిశ్రమాన్ని బయటకు తీసి కొద్దికొద్దిగా తీసుకుంటూ పుల్లలకు గుచ్చాలి. నూనె వేసుకుంటూ గ్రిల్‌ చేసుకోవాలి. సర్వింగ్‌ ప్లేట్‌లోకి మార్చుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని కబాబ్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!