ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పనస బిర్యానీ

ABN, First Publish Date - 2022-05-04T18:14:47+05:30

బాస్మతి బియ్యం- రెండు కప్పులు, పనస కాయలు- అర కిలో, నెయ్యి - 2 స్పూన్లు, ఉల్లి ముక్కలు - కప్పు, అల్లం ముక్కలు- అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, పచ్చి మిర్చి- అర స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం- రెండు కప్పులు, పనస కాయలు- అర కిలో, నెయ్యి - 2  స్పూన్లు, ఉల్లి ముక్కలు - కప్పు, అల్లం ముక్కలు- అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, పచ్చి మిర్చి- అర స్పూను, తేజ్‌ పత్తా- రెండు, యాలకులు- రెండు, మిరియాలు- 4, దాల్చిన చెక్క - 1, కారం- ఒకటిన్నర స్పూను, ధనియాల పొడి- అర స్పూను, నట్స్‌- అర కప్పు, పుదీనా- పావు కప్పు, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, కుంకమపువ్వు- నాలుగు , పెరుగు- కప్పు.


తయారుచేసే విధానం: కుంకుమ పువ్వును పాలలో నానబెట్టాలి. పనసను ముక్కలుగా కట్‌ చేసి ఉప్పునీళ్లలో వేయాలి. బాస్మతి బియ్యాన్ని అర గంట నీళ్లలో నానబెట్టాలి. మంద పాటి గిన్నెలో బియ్యం కంటే రెండింతలు ఎక్కువ నీటిని వేసి మరిగించాలి. ఇందులో నెయ్యి, ఉప్పు వేయాలి. మరుగుతున్న నీటిలో బియ్యాన్ని వేసి సగం ఉడికాక దించి, వడకట్టి పక్కన పెట్టాలి. పెద్ద పాన్‌లో నెయ్యి వేసి అందులో ఉల్లి, అల్లం, వెల్లుల్లి వేయించి కాస్త రంగు మారాక, అన్ని సుగంధద్రవ్యాల్నీ జతచేయాలి. ఇందులోనే పనస ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి కాసేపు మగ్గించాలి. పుదీనా ఆకులు, ఉప్పూ జతచేయాలి. అంతా దగ్గరకి అయ్యాక ఇందులో సగం ఉడికిన బాస్మతి బియ్యాన్ని, కుంకుమ పువ్వు పాలనీ వేసి బాగా కలిపి, మూతపెట్టాలి. పది నిమిషాలు ఉడికిస్తే పనస బిర్యానీ రెడీ. నెయ్యిలో నట్స్‌ అన్నింటినీ వేయించి బిర్యానీ పైన వేస్తే ఘుమఘుమలాడుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!