Anantapuram.. రోడ్లు ఎలా ఉన్నాయో.. రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది: నాగబాబు
ABN, First Publish Date - 2023-01-22T13:04:00+05:30
అనంతపురం: జనసేన (Janasena) పీఏసీ సభ్యుడు నాగబాబు (Nagababu) ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు.
అనంతపురం: జనసేన (Janasena) పీఏసీ సభ్యుడు నాగబాబు (Nagababu) ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా తాడిపత్రి రహదారిని పరిశీలించారు. ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డులో శ్రమదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు శ్రమదానం కోసం నాగబాబు పిలుపు ఇవ్వడంతో... ప్రభుత్వ అధికారులు నిన్నటి నుంచి హడావిడిగా ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ రోడ్లు ఎలా ఉన్నాయో.. రాష్ట్ర పరిస్థితి అలాగే ఉందని ఎద్దేవా చేశారు. జనసైనికులు రోడ్డు వేస్తారని వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) వెంటనే పనులను మొదలుపెట్టిందన్నారు.
వారాహి యాత్ర (Varahi Yatra) ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయిస్తారని నాగబాబు తెలిపారు. డెమోక్రసీ (Democracy)లో ఇల్లీగల్ (Illegal), చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా.. ఎప్పుడైనా చేయవచ్చునన్నారు. పోత్తుల గురించి మాట్లాడే సమయం ఇప్పుడు కాదన్నారు. సభలు, సమావేశాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు (High Court) మట్టికాయలు వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఇబ్బందులు పెట్టినంతమాత్రాన తమ కార్యక్రమాలు ఆగవని నాగబాబు స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-22T13:04:04+05:30 IST