ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు

ABN, First Publish Date - 2023-04-28T02:50:29+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దుచేసింది. మే 5లోగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మే 5లోగా సీబీఐ ఎదుట లొంగిపోవాలి

తెలంగాణ హైకోర్టు ఆదేశం.. లేదంటే అరెస్టు చేయొచ్చని సూచన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దుచేసింది. మే 5లోగా నిందితుడు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.. లేనిపక్షంలో అరెస్టు చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడానికి జూన్‌ 30 వరకు సీబీఐకి సుప్రీంకోర్టు గడువుఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు వరకు గంగిరెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు ముగిశాక జూలై 1న రూ.లక్ష పూచీకత్తు తీసుకుని అతడికి బెయిల్‌ మంజూరు చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ సుమలత ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర గంగిరెడ్డికి లభించిన డీఫాల్ట్‌ బెయిల్‌ (చట్టబద్ధమైన బెయిల్‌)ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కుట్రదారులు, నిందితుల మధ్య వారధి..

సీబీఐ పీపీ నాగేంద్రన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రధాన కుట్రదారులకు, హత్య చేసిన నిందితులకు మధ్య ఎర్ర గంగిరెడ్డి వారధిగా వ్యవహరించాడు.. విస్తృత కుట్రదారులు ఎవరో తేలాలంటే గంగిరెడ్డి కస్టడీ అవసరం. కుట్రదారులు సిట్‌ను సైతం ప్రభావితం చేశారు.. కేసును తప్పదోవ పట్టించేందుకు డ్రైవర్‌ ప్రసాద్‌, పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని నిందితులుగా చేర్చారు. సీబీఐ దర్యాప్తులో వారి పాత్ర లేదని తేలింది’ అని వెల్లడించారు. వివేకా హత్యకు కుట్ర చేయడం నుంచి హత్యను అమలు చేయడం, తర్వాత సాక్ష్యాలను నాశనం చేయడం వరకు ఎర్ర గంగిరెడ్డి ప్రతి దశలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. విస్తృత కుట్రపై కీలక దర్యాప్తు సాగుతున్న ప్రస్తుత తరుణంలో గంగిరెడ్డి బయట ఉండడం హానికరమని పేర్కొన్నారు. అతడు దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని.. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాడని.. అతడు బయట ఉండడం వల్ల ఏ సాక్షీ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, సి.శరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. వివేకా హత్యలో గంగిరెడ్డి పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి 11.30 గంటల నుంచి మర్నాటి ఉదయం 7.30 గంటల వరకు అతడు తన ఇంటి వద్దే ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌లో రికార్డయిందన్నారు. సిట్‌ అతడికి నార్కోటిక్‌ టెస్ట్‌ చేసిందని.. అందులో ఏం తేలిందో బయటపెట్టాలని కోరారు.

సిట్‌ వైఫల్యం వల్ల గంగిరెడ్డికి డీఫాల్ట్‌ బెయిల్‌ లభించిందని.. తద్వారా లభించిన స్వేచ్ఛను నిందితుడు పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నాడని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. డీఫాల్ట్‌ బెయిల్‌పై సుదీర్ఘకాలం పాటు నిందితుడు బయట ఉన్నాడని.. దీనివల్ల హత్యలు చేసిన వాళ్లు సైతం బయటే ఉండవచ్చని సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సీబీఐతో ఏకీభవించింది.

Updated Date - 2023-04-28T02:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising