ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taraka Ratna ఆరోగ్యంపై తాజాగా వైద్యులు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-01-31T12:02:09+05:30

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో సినీ నటుడు తారకరత్నకు వైద్య చికిత్సలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నారాయణ హృదయాలయ వైద్యులు నేడు తారకరత్న పరిస్థితిపై స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగుళూరు : బెంగళూరులోని నారాయణ హృదయాలయలో సినీ నటుడు తారకరత్నకు వైద్య చికిత్సలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నారాయణ హృదయాలయ వైద్యులు నేడు తారకరత్న పరిస్థితిపై స్పందించారు. ఇంకా తారకరత్నను ఐసీయూలో వెంటిలేటర్ మీదనే ఉంచి వైద్యం అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కొన్ని మీడియాలో ఆయనకు ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని నారాయణ హృదయాలయ వైద్యులు కొట్టిపడేశారు. ఆయనకు ఎక్మ్మో ద్వారా వైద్య సేవలు అందించడం లేదని యాజమాన్యం స్పష్టం చేశారు. బ్రెయిన్ కు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు ఇవాళ వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

టీడీపీ యువ నేత లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో (YuvaGalam Padayatra) నడుస్తూ తారకరత్న (TarakaRatna Hospitalized) సొమ్మసిల్లిపడిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా (Tarakaratna Heart Attack) నిర్ధారించారు. దీంతో టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. పాదయాత్ర ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షించడం.. చాలా యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడం ఏంటని అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-31T12:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising