Pawan Kalyan: కర్ణాటకలో పవన్ ఎన్నికల ప్రచారంపై కొనసాగుతున్న సందిగ్ధత
ABN, First Publish Date - 2023-04-20T11:12:19+05:30
అమరావతి: కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై సందిగ్ధత కొనసాగుతోంది.
అమరావతి: కర్నాటక ఎన్నికల (Karnataka Elections) నేపథ్యంలో బీజేపీ (BJP)తో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంలో బీజేపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ తరుఫున పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ భావించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ ప్రచారానికి వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన వర్గాలు మౌనంగా ఉన్నాయి.
కర్నాటక ఎన్నికల ప్రక్రియలో ప్రచారం అత్యంత కీలక పర్వం. విజయం సాధిస్తే ప్రజలకు తాము ఏం చేయబోయేది... రాజకీయ ప్రత్యర్థుల కంటే తాము ఏవిధంగా మెరుగైన అభ్యర్థులమో ఓటర్లకు తెలియజెప్పే ఘట్టం ఇది. ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు వాగ్దానాలు, హామీలు గుప్పించేందుకు కీలకమైన దశ కూడా ఇదే. అందుకే పోలింగ్‌కు ముందు జరిగే ప్రచారపర్వం రాజకీయ పార్టీలకు ఎంతో ముఖ్యమైనది. ఎన్నిక ఏదైనా.. ఎక్కడైనా ఇదే ఒరవడి కనిపిస్తుంది. మరో 20 రోజుల్లోనే అసెంబ్లీ ఓటింగ్‌కు వెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. కాగా ఎన్నికల సమయం మరింత చేరువవుతుండడంతో ఓటర్లకు చేరువయ్యేందుకు నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Updated Date - 2023-04-20T11:16:50+05:30 IST