Sivacharan Reddy: మీ కుమారుడిగా ఒప్పుకోండి.. లేదా డీఎన్ఏ పరీక్షకు రండి..
ABN, First Publish Date - 2023-01-12T10:52:32+05:30
నెల్లూరు: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనను కుమారుడిగా అంగీకరించాలని.. లేదంటే డీఎన్ఏ పరీక్షకు రావాలని మేకపాటి శివచరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
నెల్లూరు (Nellore): ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) తనను కుమారుడిగా అంగీకరించాలని.. లేదంటే డీఎన్ఏ (DNA) పరీక్షకు రావాలని మేకపాటి శివచరణ్ రెడ్డి (Mekapati Sivacharan Reddy) డిమాండ్ చేశారు. ‘‘నాన్న... మీ కుమారుడిగా మీడియా ముందు ఒప్పుకోండి.. లేదంటే డీఎన్ఏ పరీక్షకు రండి... నేను చూపిన.. చేసిన ఆధారాలపై స్పందన లేదు.. ఒక వీడియో విడుదల చేస్తే, పక్కన ఎవరో ఒత్తిడి చేస్తున్నట్టు ఉంది. నాకు మీ ఆస్తులు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కుమారుడిగా అంగీకరిస్తే చాలు.’’ అంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-01-12T11:12:38+05:30 IST