ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయాలను కాపాడుకుందాం!

ABN, First Publish Date - 2023-01-19T23:28:41+05:30

: పండుగలను జరుపు కుంటూ సంప్ర దాయాలను కాపాడుకుందామని అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో జీ.జే. రావు అన్నారు.

సంబరాల్లో పోర్టు సీఈవో జీ.జే.రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జనవరి 19 : పండుగలను జరుపు కుంటూ సంప్ర దాయాలను కాపాడుకుందామని అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో జీ.జే. రావు అన్నారు. కృష్ణప ట్నం పోర్టులోని అదానీ స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌ సెంటర్‌లో గురువారం కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలతో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె సంస్కృతిని ప్రతిబింబించే సంక్రాంతి పండుగను సంప్రదాయ రీతిలో నిర్వహించామన్నారు. హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, మహిళల రంగవల్లులు, గాలిపటాల పోటీలు ఎంతో ఆకట్టుకున్నాయి. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో సందడి చేశారు. గాలిపటాలు, రంగవల్లుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోర్టు ఆపరేషన్స్‌ హెడ్‌ మోహిత్‌ షెకావత్‌, అడ్మిన్‌ హెడ్‌ గణేశ్‌శర్మ, కార్పొరేట్‌ అఫైర్స్‌ హెడ్‌ వేణుగోపాల్‌, ప్రతినిధులు శ్రీనివాస్‌, రామానంద్‌ యాదవ్‌, వెంకటేష్‌ భాస్కరన్‌, పాడియా, అశోక్‌మిత్రా, జయరాజ్‌పిళ్లై, మీడియా మేనేజర్‌శ్రీనివాసులు, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-19T23:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising