Vizag News: జీవీఎంసీ కౌన్సిల్‌లో అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం
ABN, First Publish Date - 2023-10-19T15:49:34+05:30
జీవీఎంసీ కౌన్సిల్‌లో అధికార, ప్రతి పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్ల పరిస్థితిపై టీడీపీ సభ్యులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది.
విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్‌లో అధికార, ప్రతి పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్ల పరిస్థితిపై టీడీపీ సభ్యులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. మేయర్ హరి వెంకట కుమారి అధ్యక్షతన సమావేశం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భూములకు రోడ్ల కేటాయింపుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి జనసేన కూడా మద్దతు తెలిపింది.
జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్స్...
‘‘జీవీఎంసీ పరిధిలో అస్తవ్యస్త రోడ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?, రోడ్లు పరిస్థితి బాగోలేదు కాబట్టే సీఎం జగన్ విశాఖ వచ్చినప్పుడు హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్నారు. ఒకే రోడ్డు మీద రూ.9 కోట్ల 18 లక్షల ఎందుకు ఖర్చు పెడుతున్నారు?, ఒక వెంచర్ కోసమే ఈ రోడ్ వేస్తున్నారు. ప్రజా ధనం వృధా చేస్తున్నారు.’’ అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు.
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కామెంట్స్..
‘‘విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. అందుకే మంచి రోడ్లు వేస్తున్నాం. రోడ్లు వేస్తే అన్ని పార్టీలు వారు నడుస్తారు. వివాదం వద్దు.. రాజకీయాలు చేయవద్దు. రాజధాని అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికే వస్తారు. అప్పుడు కూడా రోడ్లు వేయవద్దని జనసేన సభ్యులు అంటారా?, అభివృద్ధిని అడ్డుకోవద్దు. ప్రతి పక్షాలు సహరించాలి.’’ అని అవంతి కోరారు.
Updated Date - 2023-10-19T15:49:34+05:30 IST