Kidney Racket: ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం..
ABN, First Publish Date - 2023-06-29T14:21:53+05:30
ఏలూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేగింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతోంది. బాధితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7 ఏడు లక్షల వరకు కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు.
ఏలూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ (Kidney Racket) కలకలం రేగింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్‌గా ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతోంది. బాధితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 7 ఏడు లక్షల వరకు కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు. బాధితుల వద్ద నుంచి తక్కువ రేటుకు కొని ఎక్కువ ధరకు కిడ్నీ రాకెట్ ముఠా విక్రయాలు జరుపుతోంది. బాధితులు కిడ్నీ రాకెట్ ముఠాను నమ్మి మోసపోతున్నారు. ఆధార్ కార్డులో పేరు మార్చి ముఠా కిడ్నీ దందా నడుపుతోంది.
ఏలూరులో బూసి అనురాధ అనే మహిళ కిడ్నీ ముఠా వలలో పడి మోసపోయింది. ఒక కిడ్నీకి ఏడు లక్షలు ఇస్తామన్న ముఠా.. సర్జరీ జరిగిన తరువాత నాలుగు లక్షలు ఇచ్చి మోసం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఒక ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. అప్పటి నుంచి మిగిలిన డబ్బులు ఇస్తారని బాధితురాలు ఎదురుచూసింది. మిగిలిన డబ్బులతో బ్రోకర్ ప్రసాద్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఏలూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ముఠా వలలో పడి మోసపోయిన మరికొందరు బాధితులు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-06-29T14:23:19+05:30 IST